Bangladesh: ఇటీవల రోజుల్లో భారత్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ తరచుగా వార్తల్లో నిలుస్తుంది. అది మంచి విషయాలతో అయితే కాదు.. గతంలో బంగ్లాదేశ్‌లో హిందువు (దీపు చంద్ర దాస్)ను చంపిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం బంగ్లాదేశ్‌లో హిందువులపై మరో హింసాత్మక సంఘటన వెలుగులోకి వచ్చాయి. ఒక గుంపు ఈ రోజు అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్‌ను కొట్టి చంపింది. ఈ దాడిలో చనిపోయిన వ్యక్తి వయసు 29 సంవత్సరాలు.
READ ALSO: Minister BC Janardhan Reddy: రోడ్ల మరమ్మతులకు డెడ్‌లైన్ పెట్టిన మంత్రి..
ఈ సంఘటన రాజ్‌బరి జిల్లాలో జరిగింది. పాంగ్షా మోడల్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ సంఘటనను ధృవీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. స్థానిక నివాసితులు అమృత్ మండల్‌ను దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారని, ఇది మూక హింసగా మారిందని తెలిపారు. అమృత్ మండల్ “సామ్రాట్ వాహిని” అనే స్థానిక ముఠాకు నాయకుడిగా ఉన్నాడు. మంగళవారం చిట్టగాంగ్ సమీపంలోని రౌజన్ ప్రాంతంలో ఒక హిందూ కుటుంబం ఇల్లు తగలబెట్టారు. రౌజన్ ప్రాంతంలో ఐదు రోజుల్లో ఏడు హిందూ కుటుంబాల ఇళ్లు తగలబెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గత వారం మైమెన్సింగ్ నగరంలో ఒక గుంపు 28 ఏళ్ల హిందూ కార్మికుడు దీపు చంద్ర దాస్‌ను దైవదూషణ ఆరోపణతో కొట్టి చంపింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. మృతుడి భార్య, వారి చిన్న పిల్లలు, తల్లిదండ్రులను ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు.
ఇప్పటి వరకు 184 మంది మృతి
బంగ్లాదేశ్‌లో ఈ హింస, దాడుల కారణంగా ఇప్పటి వరకు 184 మంది మృతి చెందారు. డిసెంబర్ 12న ఇంక్విలాబ్ మంచ్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది ఢాకాలో కాల్చి చంపబడ్డాడు. సింగపూర్‌లో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. అదే సాయంత్రం జనసమూహం డైలీ స్టార్, ప్రథమ్ అలో కార్యాలయాలకు నిప్పు పెట్టింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సాంస్కృతిక సంస్థలు ఛాయనాత్, ఉడిచి శిల్పి గోష్తి కార్యాలయాలను కూడా తగలబెట్టారు. 2025లో ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింస కారణంగా 184 మంది మరణించారని మానవ హక్కుల సంస్థ నివేదించింది.
READ ALSO: Viral Video: బైకులో కనపడకుండా అంత డబ్బు ఎలా దాచవయ్యా.. ఇంత ట్యాలెంట్ గా ఉన్నావేంట్రా..!
