Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చీఫ్ ఖలీదా జియాను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఖలీదా జియా ఆరోగ్యంపై ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్య బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. “శ్వాస తీసుకోవడంలో సమస్యలు పెరగడం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, కార్బన్ డయాక్సైడ్ పెరగడంతో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ‘ఎలెక్టివ్ వెంటిలేటర్ సపోర్ట్’పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.”
READ ALSO: Nothing Phone (4a) సిరీస్ స్పెక్స్, ధర, రంగులు లీక్.. లాంచ్ ఎప్పుడంటే..?
జియాకు మూత్రపిండాలు పనిచేయడం లేదని వైద్యులు నివేదించారు. డయాలసిస్ ప్రారంభించి, క్రమం తప్పకుండా కొనసాగినట్లు తెలిపారు. పలు రకాల అనారోగ్య సమస్యల కారణంగా ఆమెకు రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మాజీ ప్రధానమంత్రికి వాల్వ్‌లో సమస్య వచ్చిన తర్వాత TEE (ట్రాన్స్‌ఎసోఫాగియల్ ఎకోకార్డియోగ్రామ్) పరీక్షలో ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ ఉన్నట్లు తేలిందని వైద్యులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం వైద్య బోర్డు నిపుణులు చికిత్స ప్రారంభించారు. మరో వైపు ఆమెకు నవంబర్ 27న తీవ్రమైన ప్యాంక్రియా టైటిస్ సమస్యను వైద్యులు గుర్తించారు. ఆమె శరీరంలో తీవ్రమైన బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఉన్నట్లు తెలిపారు. దీని కారణంగా ఆమెకు అధిక మోతాదులో యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
మెరుగైన చికిత్స కోసం బీఎన్‌పీ చీఫ్‌ను లండన్‌కు తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి, కానీ ప్రస్తుతం జియా ఆరోగ్యం ఆమెను లండన్‌కు విమానంలో తరలించగలిగే స్థితిలో లేదని సమాచారం. అందుకే ఇంకా ఆమెను విమానంలో లండన్‌కు తరలించలేదు.
READ ALSO: Tej Pratap Yadav: పశ్చిమ బెంగాల్, యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనశక్తి జనతాదళ్..
