Lockdown: లాక్ డౌన్ వచ్చేసింది.. ఉదయం 9 నుంచి 4 గంటల వరకే ఆఫీస్‌లు..
- తీవ్ర సంక్షోభంలో బంగ్లాదేశ్..
- లాక్ డౌన్ విధించిన వైనం..
- ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఆఫీస్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పశ్చిమాసియాలో చెలరేగుతున్న ఇరాన్ యుద్ధ జ్వాలలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడే బంగ్లాదేశ్ వంటి దేశాలు తీవ్రమైన ‘ఎనర్జీ క్రైసిస్’ను ఎదుర్కొంటున్నాయి. డాలర్ల నిల్వలు తగ్గడం, చమురు ధరలు పెరగడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యవసర పొదుపు మంత్రాన్ని పఠిస్తోంది.
బంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 95 శాతం ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. ఈ కష్టకాలంలో పొరుగు దేశం భారత్ వెన్నుదన్నుగా నిలిచింది. ఇప్పటికే బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు సుమారు 5 వేల టన్నుల డీజిల్‌ను భారత్ అదనంగా సరఫరా చేసింది. కేవలం బంగ్లాదేశే కాకుండా, శ్రీలంక, మాల్దీవులు కూడా ఇంధన సాయం కోసం భారత్ వైపు చూస్తుండటం గమనార్హం. ఇది దక్షిణాసియాలో భారత్ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
Also Read
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
విద్యుత్ ఆదా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు ఇకపై ఉదయం 9 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4 గంటలకే ముగియాలి. అంటే ఒక గంట ముందే పని ముగించుకుని ఇంటికి వెళ్లడం ద్వారా ఏసీలు, లైట్ల వినియోగం తగ్గుతుందని అంచనా. బ్యాంకులు కూడా మధ్యాహ్నం 3 గంటలకే కస్టమర్ సేవలను ఆపివేసి, 4 గంటల కల్లా మూతబడనున్నాయి.
Also Read:War Effect: యుద్ధం ఎఫెక్ట్.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్..
ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ప్రభుత్వం తన బడ్జెట్‌లో కోతలు విధించింది. ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన విద్యుత్, ఇంధన బడ్జెట్‌లో 30 శాతం తగ్గించాలని ఆదేశించింది. అలాగే.. విలాసవంతమైన ఖర్చులకు చెక్ పెడుతూ కొత్తగా కార్లు, విమానాలు లేదా నౌకల కొనుగోలును పూర్తిగా నిషేధించింది. వేడుకల్లో రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణపై కూడా ఆంక్షలు విధించారు.
మార్కెట్లపై ఆంక్షలు..
సాధారణ ప్రజల జీవనశైలిలో కూడా మార్పులు వచ్చేలా షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఫుడ్ సెంటర్లు, మందుల షాపులు, అత్యవసర సేవలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. సుమారు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్, తన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకే ఈ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి సుమారు 2.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోరుతున్న తరుణంలో.. భారత్ అందిస్తున్న డీజిల్ సరఫరా ఆ దేశానికి పెద్ద ఊరటనిస్తోంది.
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!