Bangladesh: బంగ్లాదేశ్‌లో పాలిటిక్స్ హీటెక్కాయి. ప్రస్తుతం బంగ్లాలో నెలకున్న రాజకీయ గందరగోళం మధ్య ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌పై నిషేధం కారణంగా, ఈ పార్టీ ఫిబ్రవరి 2026 జాతీయ పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొనదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు షఫీకుల్ ఆలం మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో రాజకీయ కార్యకలాపాలు నిషేధించిన అవామీ లీగ్ రాబోయే జాతీయ ఎన్నికలలో పోటీలో ఉండదని ప్రకటించారు.
READ ALSO: Vrushabha Review: వృషభ రివ్యూ.. మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?
తాత్కాలిక ప్రభుత్వ సలహా మండలి సమావేశం తర్వాత, అవామీ లీగ్‌పై నిషేధం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా చట్టసభ సభ్యులు ప్రధాన సలహాదారునికి పంపినట్లు చెబుతున్న లేఖ గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆలం పైవిధంగా సమాధానం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆ లేఖను తాను చూడలేదని, దాని గురించి తనకు తెలియదని అన్నారు. అయితే అవామీ లీగ్ విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. “అవామీ లీగ్ కార్యకలాపాలు నిషేధించిన కారణంగా, ఎన్నికల కమిషన్ ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. దీంతో అవామీ లీగ్ ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు” అని చెప్పారు.
ఆ పార్టీ రిజిస్ట్రేషన్ నిలిపి వేశారని, అలాగే ఆ పార్టీకి చెందిన నాయకులు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో విచారణలో ఉన్నారని గుర్తుచేశారు. మే ప్రారంభంలో, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్, దాని అనుబంధ సంస్థల కార్యకలాపాలను నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో విచారణలు పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని ఆ గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఉగ్రవాద నిరోధక ఆర్డినెన్స్ కింద ఈ చర్య తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
READ ALSO: Adani Group: 3 ఏళ్లలో రూ.80 వేల కోట్లు! అదానీ షాకింగ్ షాపింగ్ లిస్ట్ ఇదే!
