Site icon NTV Telugu

MI W vs RCB W: నాడిన్ డి క్లెర్క్ తుఫాన్ ఇన్నింగ్స్.. నాల్గవ సీజన్‌ను విక్టరీతో ప్రారంభించిన బెంగళూరు

Wpl

Wpl

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. నాడిన్ డి క్లెర్క్ అర్ధ సెంచరీతో స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. క్లార్క్ 44 బంతుల్లో అజేయంగా 63 పరుగులు చేశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సజీవన్ సజ్నా 25 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నికోలా కారీ కూడా 29 బంతుల్లో 40 పరుగులు సాధించారు.

Also Read:Silver Price vs Bikes: కిలో వెండికి ఖర్చు చేసే డబ్బుతో ఈ ఐదు స్పోర్ట్స్ బైక్స్ కొనొచ్చు!

ఓపెనర్ జి. కమలినీ 28 బంతుల్లో 32 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 17 బంతుల్లో 20 పరుగులు చేసింది. నాట్ స్కైవర్-బ్రంట్, అమేలియా కెర్ తలా 4 పరుగులు అందించారు. నాడిన్ డి క్లెర్క్ 4 ఓవర్లలో 26 పరుగులకు 4 వికెట్లు పడగొట్టారు. శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్ తలా 1 వికెట్ తీసుకున్నారు. 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్‌సిబికి మంచి ఆరంభం లభించింది. స్మృతి మంధాన, గ్రేస్ హారిస్ 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో ఓవర్‌లో మంధాన 13 బంతుల్లో 18 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయింది. మంధాన ఔటైన తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. గ్రేస్ హారిస్ 12 బంతుల్లో 25 పరుగులు, దయాలన్ హేమలత 7 పరుగులు, రాధా యాదవ్ 1 పరుగులు, రిచా ఘోష్ 6 పరుగులు చేశారు.

ఆ తర్వాత నాడిన్ డి క్లెర్క్, అరుంధతి రెడ్డి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నికోలా కారీ రెడ్డిని అవుట్ చేయడం ద్వారా భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశారు. ఆమె అమేలియా బౌలింగ్‌లో క్యాచ్‌ను తీసుకుంది. రెడ్డి 25 బంతుల్లో 20 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన శ్రేయాంక పాటిల్ కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్‌లో ఆర్‌సిబికి 18 పరుగులు అవసరం. క్లార్క్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఆర్‌సిబికి విజయాన్ని అందించారు.

Also Read:Iran: పూర్తిగా అదుపుతప్పిన ఇరాన్.. అగ్నికీలల్లో వాహనాలు, ఆస్తులు

క్లార్క్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. ప్రేమ రావత్ 4 బంతుల్లో 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ముంబై తరఫున నికోలా కారీ, అమేలియా కెర్ రెండు వికెట్లు పడగొట్టారు. నాట్ స్కైవర్-బ్రంట్, షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Exit mobile version