Site icon NTV Telugu

BG Blockbusters: కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన బండ్ల గణేష్.. ‘బండ్ల గణేష్ బ్లాక్‌బస్టర్స్’ గా నామకరణం..!

Bg Blockbusters

Bg Blockbusters

BG Blockbusters: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా,ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ‘బండ్ల గణేష్’. అప్పుడు వివిధ కాంట్రవర్సీలతో వార్తల్లో ఉండే ఆయన విజయవంతమైన నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేశారని చెప్పవచ్చు. అయితే తాజాగా బండ్ల గణేష్ మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇదివరకు ‘అంజనేయులు’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌ను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా తెరెకెక్కిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సంచలన బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్ సింగ్’ ప్రొడక్షన్స్’ బ్యానర్‌ కు మంచి పేరు తీసుకొచ్చింది.

200MP హై-రెజల్యూషన్ కెమెరా, 6,000mAh డ్యూయల్ బ్యాటరీ సెటప్తో Oppo Find N6

‘గబ్బర్ సింగ్’ ఘనవిజయం తర్వాత అదే బ్యానర్‌పై బాద్‌షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంటి భారీ హిట్ చిత్రాలను నిర్మించి కమర్షియల్‌గా అలాగే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ తర్వాత కొద్దీ రోజులు రాజకీయాలవైపు కూడా ప్రయాణించారు. అక్కడ ఆయన ప్రయాణం ముగిసిన తర్వాత.. కొంతకాలం విరామం తర్వాత సరైన సమయం కోసం ఎదురుచూసి చివరకు ఇప్పుడు కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Financial Planning: డబ్బు సేవ్ చేయాలనుకుంటున్నారా..? 50-15-5 ఫైనాన్షియల్ రూల్ పాటిస్తే సరి..!

ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ పేరు ‘బండ్ల గణేష్ బ్లాక్‌బస్టర్స్’ (BG బ్లాక్‌బస్టర్స్). ఈ బ్యానర్ ప్రత్యేకత ఏమిటంటే.. రాబోయే తరం కూడా ఇందులో భాగస్వామ్యం కావడం. BG బ్లాక్‌బస్టర్స్ ద్వారా హృదయానికి హత్తుకునే కథలతో పాటు, కొత్త ఆలోచనలతో కూడిన కంటెంట్ ఆధారిత సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో బండ్ల గణేష్ స్థాపించారు. నిజాయితీతో కూడిన కథనాలు, కొత్త ప్రతిభకు అవకాశాలు, వినూత్నమైన కథ చెప్పే విధానమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక ప్రాజెక్ట్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Exit mobile version