Site icon NTV Telugu

Bandi Sanjay: తెలంగాణను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రయత్నిస్తాం..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: తెలంగాణలో వరద, వర్ష ప్రభావంతో తీవ్ర నష్టం జరిగిందన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఖమ్మంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, రాష్ట్ర మంత్రులతో కలిసి పర్యటన చేశామన్నారు. సెక్రటేరియట్‌లో సమీక్ష చేపట్టామని ఆయన తెలిపారు. తెలంగాణను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. నిబంధనల మేరకు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నివేదిక అందిందని ఆయన చెప్పారు. ఇది రాజకీయాలతో కూడిన సమస్య కాదని.. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

Read Also: CM Relief Fund: రాష్ట్రంలో వరదలు.. సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

గతంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోలేదని.. దానితో చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ప్రజల కోసమే తాను సెక్రటేరియట్‌కు వెళ్లినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొ్నారు. అధికారులు కూర్చోవడానికి సెక్రటేరియట్‌లో స్థలమే లేదన్నారు. కేసీఆర్ నవగ్రహ యాగం కాదు…. దశగ్రహ యాగం చేయాలన్నారు. కేసీఆర్‌కు ఎంట్రీనే లేదు… ఇంకా రీ ఎంట్రీ ఎక్కడిదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ యాగం ఎందుకోసం చేశావని ప్రశ్నించారు. గతంలో వరదలు వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఎప్పుడూ కేంద్ర మంత్రుల్ని పిలవలేదన్నారు.

 

Exit mobile version