Site icon NTV Telugu

Bandi Sanjay : కొండగట్టు అంజన్న సాక్షిగా అబద్దాలు చెబుతారా?

Bandi Sanjay

Bandi Sanjay

కొండగట్టు అంజన్న సాక్షిగా అబద్దాలు చెబుతారా? 6 గ్యారంటీల అమలు చేస్తే ఎంతమందికి ఇచ్చారో చెప్పే దమ్ముందా? ఒక్క మహిళకైనా నెలనెలా రూ.2500లు ఇస్తున్నారా? అని ధ్వజమెత్తారు బండి సంజయ్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్క రైతుకైనా వడ్లపై రూ.500 బోనస్, రూ.15 వేల భరోసా సొమ్ము ఇస్తున్నారా? ఏ ఒక్క విద్యార్ధికైనా రూ.5 లక్షల భరోసా కార్డు ఇచ్చారా? అని ఆయన అన్నారు. ఏ ఒక్క వ్రుద్దుడికి, వితంతవుకైనా రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా? ఒక్క రైతుకైనా రూ.2 లక్షల రుణమాఫీ చేశారా? కరీంనగర్ ప్రజలకు మీరు చేసిందేమిటి?

మీరు అభివ్రుద్ధి చేసి ఉంటే డిపాజిట్లు రాకుండా ఎందుకు ఓడిస్తారు? కరీంనగర్ నుండి పారిపోయి హుస్నాబాద్ ఎందుకు వెళ్లారు? అని మంత్రి పొన్నం వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మంచోడనే ముసుగులో వినోద్ కుమార్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

అంతేకాకుండా..’రోడ్ల విస్తరణ, ఆర్వోబీ పనులుసహా కరీంనగర్ అభివ్రుద్ధికి రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తెచ్చింది నేనే. తానే చేసినట్లుగా బీఆర్ఎస్ అభ్యర్ధి ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు. వినోద్ మంచోడైతే… ఆయన ఫోటోతో జనంలోకి వెళతారా? కేసీఆర్ ఫొటోతో వెళతరా? చెప్పాలి. బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవుతుందని వ్యాఖ్య. 5 ఏళ్లలో ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్లిన చరిత్ర నాది. బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయమైందని వ్యాఖ్య. కాంగ్రెస్ కు అభ్యర్ధే కరువయ్యారని ఎద్దేవా. ఈనెల 19 న బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు బండి సంజయ్‌

Exit mobile version