కరంనగర్ జిల్లాలోని ముగ్దుంపురం ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 200 మంది నాయకులు బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ సిద్ధాంతాలు, బండి పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని ఆసిఫాబాద్ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం పేరుతో ఆర్టీసీ ఆస్తి పత్రాల రెడీ అయ్యాయి. 99 ఏళ్ల లీజు పేరుతో దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: BRS Party: బీజేపీ, కాంగ్రెస్ లకు షాక్.. నేడు కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్న ఆ నలుగురు
తెలంగాణలో మరోసారి కేసీఆర్ పొరపాటున గెలిచిన ఆర్టీసీ ఆస్తులు మిగలవు అని బండి సంజయ్ ఆరోపించారు. మీ పక్షాన యుద్దం చేస్తున్న నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.. మీపక్షాన పోరాడే నాలాంటోళ్లకు అండగా నిలవండి అని కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ వినతి చేశారు. సొమ్ము కేంద్రానైతే గంగుల సోకు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే ఆర్వోబీ, స్మార్ట్ సిటీ సహా కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ముగ్దుంపురలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ముగ్దంపురలో వడ్ల బస్తాలను ఐకేపీ కేంద్రానికి తరలిస్తున్న ట్రాక్టర్ ఎక్కి ఆయన నడిపించారు.