Site icon NTV Telugu

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ మరో లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు 5 పేజీల బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. దళితులు సంక్షేమ పట్ల చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అర్హులకు 10 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని… డిమాండ్‌ చేశారు.

దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని… కెసిఆర్ దళితులను నిట్టనిలువునా మోసగించారని లేఖలో విమర్శించారు. దళితులకు మంత్రి వర్గంలో తగిన ప్రాధాన్యత కెసిఆర్ ఇవ్వడం లేదని ఆరోపించిన బండి సంజయ్… 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా దళితులకు తెరాస పార్టీ , ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ప్రతీ ఒక్క హామీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు కెసిఆర్ ద్రోహం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఎస్సీ , ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్.

Exit mobile version