జగిత్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటనపై రూరల్ ఎస్సై అనిల్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. రేపటి జగిత్యాల పట్టణ బంద్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయ నాయకులు కొన్ని వర్గాలు వారి స్వలాభం కోసమే బంద్ చేస్తున్నారు అని అనిల్ అన్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. పోలీస్ఉన్నతాధికారులపై, చట్టంపై నాకు నమ్మకం ఉంది అని ఎస్సై అనిల్ తెలిపారు. పోలీస్ క్రమశిక్షణ చర్యలను పోలీస్ నియమ నిబంధనల ప్రకారం చట్టపరంగా పరిష్కరించుకుంటాను అని ఆయన వెల్లడించారు.
Also Read : Anni Manchi Sakunamule Trailer: నువ్వు కటౌట్ వే.. ప్రభాస్ వి కాదు
కాగా.. సస్పెన్షన్ వేటుపడిన ఎస్సై అనిల్‌కు మద్దతుగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ రేపు జగిత్యాల బంద్ కు పిలుపునిచ్చింది. వెంటనే ఎస్సై అనిల్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఎస్సై విషయంలో ఎలాంటి విచారణ జరగకుండానే సస్పెండ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులో బలహీన వర్గానికి చెందిన ఓ మహిళ మీద దాడి చేసి, పైగా ఆ మహిళ భర్త అయిన ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేశారని, ఇది కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందని అన్నారు. అందు కోసమే రేపు ( శనివారం ) జగిత్యాల పట్టణ బంద్ కు పిలుపునిచ్చినట్లు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రకటించాయి. ఇదే ఇష్యూపై ఇప్పటికే టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు.
Also Read : Retail inflation: 18 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం..