NTV Telugu Site icon

BC Janardhan Reddy: జగన్, కాటసాని రామిరెడ్డిలు మహానటులు.. బీసీ జనార్ధన్ రెడ్డి కౌంటర్‌!

Bc Janardhan Reddy

Bc Janardhan Reddy

BC Janardhan Reddy: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు మహానటులు..ఒకరిని మించి మరొకరు తమ నటనతో బనగానపల్లె ప్రజలకు మాంచి యాక్షన్ కామెడీ సినిమా చూపించారని, తమ అసమర్థతను తామే ఘనంగా చాటి చెప్పుకున్నందుకు ధన్యవాదాలు అని బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బనగానపల్లె పట్టణంలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, కాటసాని రామిరెడ్డిలు తనపై చేసిన విమర్శలకు బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ వరుస ప్రశ్నలతో, పంచ్‌ డైలాగులతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

బనగానపల్లె పట్టణంలో గత నాలుగేళ్లుగా సాగుతున్న 100 పడకల ఆసుపత్రికి ఎన్నికల కోడ్‌కు సరిగ్గా 2 రోజులు మందు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేదలకు 3 వేల పట్టాలు ఇస్తుంటే..చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కాటసాని రామిరెడ్డి సీఎం జగన్‌ను రిక్వెస్ట్ చేశారు. ఇళ్ల పట్టాల విసయంలో తనపై జగన్, రామిరెడ్డిలు చేసిన విమర్శలపై బీసీ జనార్థన్ రెడ్డి ఆధారాలతో సహా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. తాను ఇళ్ల పట్టాలు అడ్డుకోలేదని ఎస్‌ఆర్‌బీసీ ముంపు ప్రాంతంలో కాకుండా నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇస్తే అభ్యంతరం లేదని చెప్పానని, కానీ నివాసయోగ్యమైన స్థలాలను 3 కోట్లకు అమ్ముకున్న కాటసాని రామిరెడ్డి ఎస్ఆర్‌బీసీ ముంపు ప్రాంతంలో ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు కాబట్టే తాను కోర్టులో కేసులు వేసానని చెప్పారు. హైకోర్టు కూడా తన పిటిషన్‌పై స్టే ఇస్తే అధికారంలోకి ఉన్నది మీ పార్టీ, మీ ప్రభుత్వమే కదా ఎందుకు కౌంటర్ వేయలేకపోయారని బీసీ జనార్ధన్‌రెడ్డి నిలదీశారు. అధికారంలో ఉంది మీ ప్రభుత్వమే కదా…ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు తీసుకువచ్చి జగనన్న కాలనీలు ఎందుకు కట్టించలేకపోయావని కాటసాని రామిరెడ్డిని ఆయన ప్రశ్నించారు. కాటపాని రామిరెడ్డి చేతకానితనం, అసమర్థత వల్ల బనగానపల్లెలో పేదలకు ఇళ్ల పట్టాలు దూరమయ్యాయని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇక బనగానపల్లెలో విస్తరించిన నాపరాయి పరిశ్రమ రాయల్టీని తగ్గిస్తామని, బందార్లపల్లె చెక్‌పోస్ట్ ను ఎత్తివేస్తామని జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీసీ జనార్ధన్‌ రెడ్డి నిలదీశారు. ఎస్ఆర్‌బీసీలో నీళ్లు పారుతున్నా దద్దనాలకు నీళ్లు లిఫ్ట్ చేయకుండా.. దద్దనాల ప్రాజెక్టును ఎండబెట్టిన ఘనత మీ అసమర్థ ప్రభుత్వానిదే అంటూ జగన్, రామిరెడ్డిలకు చురకలు అంటించారు. బనగానపల్లెకు టీడీపీ హయాంలో మంజూరైన రింగ్ రోడ్డును ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. హంగూ ఆర్భాటంగా ప్రారంభించిన 100 పడకల ఆసుపత్రిలో కేవలం 15 మంది వైద్యులు తప్పితే హార్ట్ ఎటాక్ వస్తే సరైన వైద్యులు, ఎక్విప్‌మెంట్ లేదని, వివిధ విభాగాలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు లేరని, ఎన్నికల కోడ్ వస్తుందని హడావుడిగా ప్రారంభించారని విమర్శించారు.

బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి ధనవంతుడు…కాటసాని రామిరెడ్డి పేదవాడు అంటూ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ జనార్ధన్‌ రెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నేను ధనవంతుడినే కానీ నాకంటే పెద్ద ధనవంతులు మీరే కదా జగనన్న అంటూ అదిరిపోయే సెటైర్లు వేశారు. బనగానపల్లెలో ఒక కొట్టంలో కుటుంబంతో ఉండడానికి సరిపోక, కర్నూలులో ఇంకో కొట్టంలో ఉంటున్న నిరుపేద కాటసాని రామిరెడ్డికి జగనన్న కాలనీలో ఓ డ్యూప్లెక్స్ కట్టివ్వండి జగనన్నా అంటూ బీసీ జనార్థన్ రెడ్డి అదిరిపోయే పంచ్‌లు వేసారు.