NTV Telugu Site icon

Telangana Bandh : నీట్ కౌన్సిలింగ్ కి వ్యతిరేకంగా ఈ నెల 6న బంద్‌కు పిలుపు

Balmuri Venkat

Balmuri Venkat

నీట్ కౌన్సిలింగ్‌కి వ్యతిరేకంగా ఈ నెల 6వ తేదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కి పిలుపునిస్తాము ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తెలిపారు. రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పరీక్షను రద్దు చేసిన మళ్లీ నిర్వహించాలని, NTA ను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి , యువజన ఐక్య కమిటీ అధ్వర్యంలో గవర్నర్ అప్పోయింట్మెంట్ కోరడం జరిగింది. గవర్నర్ అప్పోయింట్మెంట్ ఇవ్వకపోవడం తో ముట్టడి కి బయలుదేరారు నేతలు. పీపుల్స్ ప్లాజా నుండి రాజభవన్ వరకు ర్యాలీ గా విద్యార్థి సంఘాల నేతలు బయలుదేరారు. ఐమ్యాక్స్ సర్కిల్ వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం వద్ద విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్ కి పోలీస్ లు తరలించారు. ఈ రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ,(NSUI -SFI – AISF – PDSU -VJS-AIPSU- PYC- DYFI-AIYF-PYL-YJS) నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని రుజువైన కేంద్ర ప్రభుత్వం,NTA పరీక్షలు రద్దు చేయకుండ మౌనంగా ఉండడం దుర్మార్గమన్నారు. గత 20రోజుల నుండి నీట్ విద్యార్థుల పక్షాన అన్ని సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం నుండి కూడా 70 వేలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారన్నారు. అప్పోయింట్మెంట్ అడిగిన కిషన్ రెడ్డు గారు స్పందించకపోవడం తో ఆయన ఇంటిని ముట్టడించామని, స్టూడెంట్ మార్చ్ నిర్వహించాము, సిగ్నిచర్ కాంపెయిన్ చేశాము, నిన్న ఢిల్లీ లో పార్లమెంట్ ముట్టడి చేశామన్నారు బల్మూర్‌ వెంకట్‌. రాష్ట్ర వ్యాప్తంగా మోదీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేశామని, గవర్నర్ గారికి నీట్ విద్యార్థుల పక్షాన రిప్రెసెంటేషన్ ఇవ్వడానికి అప్పోయింట్మెంట్ కోరితే ఇవ్వలేదన్నారు. అందుకే రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరామన్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అన్ని విద్యార్థి సంఘాల అధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద మహా దీక్ష చేస్తామని, అప్పటికి స్పందించకపోతే నీట్ కౌన్సిలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు బంద్ పిలుపునిస్తామన్నారు బల్మూరి వెంకట్‌. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా NTAను,నీట్ పరీక్షలు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.