ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ లు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నేడు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నిక ధ్రువీకర పత్రం తీసుకున్నారు వెంకట్..మహేష్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు కావడం సంతోషంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ గెలుపుకోసం కృషి చేశాడని, బల్మూరి వెంకట్ చేసిన ఉద్యమాలను పార్టీ గుర్తించిందన్నారు శ్రీధర్ బాబు. పని చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుందని శ్రీధర్ బాబు వెల్లడించారు.
అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. అతి చిన్న వయసులో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 9 సంవత్సరాలు నాతో పాటు ప్రతి ఉద్యమంలో పాల్గొన్న ఎన్‌ఎస్‌యూఐ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు బల్మూరి వెంకట్. విద్యార్థి, నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. తర్వాత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నా సేవలు గుర్తించి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే పదవులు వస్తాయన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కౌన్సిల్ లో నా వంతు ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు.