Site icon NTV Telugu

Congress MLC’s : ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన బల్మూరి వెంకట్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌

Balmoori Venkat

Balmoori Venkat

కాంగ్రెస్ నుంచి నూత‌నంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ లు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. బుధ‌వారం మధ్యాహ్నం 3.30 గంటలకు శాసన మండలి చైర్మన్ ఛాంబర్ లో ఇరువురు నేత‌లు ఎమ్మెల్సీ లుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులఎమ్మెల్యేలు హాజ‌ర‌వుతార‌య్యారు. అయితే.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం ఉత్సవానికి హాజరైన ముఖ్య అతిధులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీగా తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్రంలోని అన్ని విభాగాల నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన నా సేవలను గుర్తించారన్నారు బల్మూరి వెంకట్‌. తన నియామకం పట్ల ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వానికి, శాసనసభ్యులకు, మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం మాపై ఉంచిన బాధ్యతను ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసే విధంగా ముందుకు సాగుతామన్నారు బల్మూరి వెంకట్‌.

అనంతరం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తమ నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఇంచార్జీ దీపా దాసు మున్షి, ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా యువతకు అవకాశం కల్పించడం పట్ల రాష్ట్రంలో యువతకు రాజకీయాల్లోకి ప్రోత్సాహం పెరుగుతుందన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. శాసన మండలి అనేది పెద్దల సభ అలాంటి పెద్దల సభలో మాకు అవకాశం కల్పించడం రాహుల్ గాంధీ తీసుకున్న గొప్ప నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నందున అన్ని సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు.

Exit mobile version