Site icon NTV Telugu

Ballari Tension: బళ్లారిలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం

Ballari Tension

Ballari Tension

Ballari Tension: కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గురువారం అర్ధరాత్రి బళ్లారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులకు పాల్పడ్డాడు. గన్‌మన్ తుపాకీ లాక్కుని ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్‌రెడ్డి 2 రౌండ్లు కాల్చాడు. ఈ కాల్పుల నుంచి మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తృటిలో తప్పించుకున్నాడు. ఇదే టైంలో ఇరువర్గాల మధ్య పరస్పర కాల్పులు చెలరేగాయి. ఈ కాల్పుల కారణంగా ఒకరు మృతి చెందగా, ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్‌కు గాయాలు అయ్యాయి.

READ ALSO: Astrology: జనవరి 2, శుక్రవారం దినఫలాలు..

బళ్లారిలో మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు కోసం ఫ్లెక్సీలు కడుతుండగా ఈ వివాదం చేలరేగి అది కాస్త.. కాల్పుల వరకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు కోసం గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి ఫ్లెక్సీలు కట్టాలని ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి ప్రయత్నిస్తుండగా, దానికి గాలి అనుచరులు వద్దని వారించారు. ఇక్కడే వివాదం చెలరేగి, అది కాస్తా కాల్పుల వరకు వెళ్లింది.

READ ALSO: OTR: బిఆర్ఎస్ ఎమ్మెల్యే & కాంగ్రెస్ సీనియర్ నేత కలసి ఇసుక దందా..!!

Exit mobile version