Site icon NTV Telugu

Balka Suman : సీఎం రేవంత్‌ రెడ్డికి బాల్క సుమన్‌ లేఖ

Balka Suman

Balka Suman

ముఖ్య మంత్రి ఏ.రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లేఖ రాశారు. టెట్ -2024 పరీక్ష ఫీజులను విద్యా శాఖ భారీగా పెంచిందని, గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే 200ల ఫీజు, రెండు రాసిన వారికి 300పీజు తీసుకున్నారని బాల్క సుమన్‌ లేఖలో పేర్కొన్నారు. త్వరలో జరగబోయే టెట్ పరీక్ష పీజు ఒక పేపర్ కు 1000, రెండు పేపర్లకు 2000 రూపాయాలకు పెంచడం సరికాదని ఆయన అన్నారు. పించిన పీజుల వల్ల నిరుపేద, మధ్యతరగతి అభ్యర్ధులపై చాలా భారం పడుతుందని, ప్రభుత్వం కేవలం 11 జిల్లా కేంద్రాల్లోనే టెట్ పరీక్ష ఉంటుందని ప్రకటించారన్నారు. దీని వల్ల కూడా మిగతా జిల్లాల అభ్యర్థులు ఇబ్బంది పడతారని, దూర భారం తో పాటు ఆర్థికంగానూ భారం పడుతుందని, మొత్తం 33 జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగలరని మనవి చేశారు బాల్క సుమన్‌. 7 లక్షల మంది నిరుద్యోగుల సమస్యను అర్ధం చేసుకుని పెంచిన ఫీజులు తగ్గించాలని కోరుతున్నామని ఆయన వెల్లడించారు.

 

Exit mobile version