Site icon NTV Telugu

Balayya : రికార్డులు కొత్తేమి కాదు.. సృష్టించాలన్న నేనే.. తిరగరాయాలన్న నేనే..!

Balakrishna

Balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మాస్ డైలాగులు, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు.. ఆకట్టుకునే అనుబంధాలు, ఉర్రూతలూరించే పాటలు.. ఇలాంటి చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు.. రాయడానికి రాతలు సరిపోవు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు బాలయ్య.. ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి లెజెండ్.. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకుంది..

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమా వచ్చి పదేళ్లను పూర్తి చేసుకున్న సందర్బంగా వేడుకను నిర్వహించారు.. ఈ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ.. ఆయన ప్రతిరూపంగా నిలిపిన నా కన్నతండ్రికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ వేడుకు సినిమా విడుదలకు ముందు జరుపుకునే పండగలాంటి అనుభూతిని ఇస్తుంది. ఎల్లుండి ఈ సినిమా రీరిలీజ్ అవుతుంది. మళ్ళీ వందరోజుల పండగ జరుపుకుంటాం.. ని ఈ సినిమా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారికి శుభాకాంక్షలు తెలిపారు.. అలాగే సినిమాలో పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు..

అలాగే మంచి ఉద్దేశంతో సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరిస్తారు. వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు చేయాలని ప్రోత్సహిస్తారు.. సినిమాలు నచ్చితే జనం ఎలా అభిమానాన్ని పెంచుకుంటారో కళ్ల ముందే చూస్తున్నాం.. రికార్డులు సృష్టించడం నాకు కొత్తకాదు… సృష్టించాలన్న నేనే.. తిరగరాయాలన్న నేనే అంటూ బాలయ్య చెప్పిన డైలాగు ఈవెంట్ కు హైలెట్ గా నిలిచింది.. ఇక ఈ సినిమాను ఈ నెల 30 న రీరిలీజ్ చెయ్యనున్నారు.. ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే..వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..

View this post on Instagram

 

A post shared by NTV Telugu (@ntvtelugulive)

Exit mobile version