NTV Telugu Site icon

Pawan Kalyan : బాలయ్య వచ్చేస్తున్నాడు.. మరి పవన్ ఎప్పుడో..?

Balayya ,pawan

Balayya ,pawan

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు వుంటంతో పవన్ కల్యాణ్ ,బాలయ్య తమ సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి రాజకీయ ప్రచార కార్యక్రమాలలో బిజీ అయిపోయారు.అయితే రాష్ట్రంలో ఎన్నికల తంతు ముగిసింది.ఊహించని విధంగా కూటమి ఘన విజయం సాధించింది.బాలయ్య హిందూపురం నుంచి ,అలాగే పవన్ పిఠాపురం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.అలాగే పవన్ కల్యాణ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసారు.అయితే ఎన్నికల హడావుడి ముగియడంతో బాలయ్య వరుసగా షూటింగ్స్ కు హాజరు కాబోతున్నారు.

Read Also :Kalki 2898 AD : ఓవర్సీస్ లో సెన్సేషనల్ బుకింగ్స్ తో దూసుకుపోతున్న ప్రభాస్ కల్కి..

బాలయ్య ప్రస్తుతం దర్శకుడు బాబీ డైరెక్షన్ లో “NBK 109 ” మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఈ నెల 20 నుంచి మొదలు కానుంది.ప్రస్తుతం బాలయ్య ఎమ్మెల్యే గా ,యాక్టర్ గా ఎంతో బిజీ గా వున్నారు.అయితే పవన్ కల్యాణ్ కూడా పూర్తిగా రాజకీయాలలో బిజీ అయిపోయారు.త్వరలో మంత్రిగా భాద్యతలు తీసుకోనున్నారు.అయితే ఆయన నటిస్తున్న సినిమా దర్శక నిర్మాతలు పవన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం పవన్ లైనప్ లో “ఓజి “,”హరిహర వీరమల్లు”,”ఉస్తాద్ భగత్ సింగ్” వంటి సినిమాలు వున్నాయి.పవన్ నటిస్తున్న “ఓజి” సినిమా ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.మరో 20 రోజులు షూటింగ్ చేస్తే ఈ సినిమా కంప్లీట్ అవుతుంది.దీనితో ఈ సినిమా సెట్స్ లోకి పవన్ ఎప్పుడు అడుగు పెడతారో అనేది ఆసక్తికరంగా మారింది.

Show comments