NTV Telugu Site icon

Balayya : ఆ సినిమా విషయంలో తన నిర్ణయం మార్చుకున్న బాలయ్య..?

Whatsapp Image 2023 06 12 At 8.05.42 Am

Whatsapp Image 2023 06 12 At 8.05.42 Am

అద్భుతమైన కథకు సంగీతం కూడా అంతే అద్భుతంగా అయితే ఉండాలి.నిజానికి ప్రతి సినిమాకు కొంత హైప్ తీసుకురావాలంటే మ్యూజిక్ బాగుంటే చాలు. కథకు సరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే సినిమాకు మరో ప్లస్ అని చెప్పొచ్చు.. సినిమాకు అదిరిపోయే సంగీతం ఉంటే ఆ స్థాయిలో సినిమా కూడా వర్కవుట్ అవుతుంది..ఇక ఈ మధ్య టాలీవుడ్ లో ఏ సినిమాకు చూసిన మ్యూజిక్ విషయంలో థమన్ పేరే కనిపిస్తుంది. పెద్ద పెద్ద సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా ఆయన సంగీతం అందిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నాడని తెలుస్తుంది.ముఖ్యంగా బాలయ్య సినిమాలకు థమన్ ఇచ్చే సంగీతం వేరే లెవల్ అని చెప్పవచ్చు.అఖండ మరియు వీరసింహా రెడ్డి సినిమాలకు బాలయ్య ఎలివేషన్ సీన్లకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్.ఆ సినిమాలు ఆ స్థాయిలో ఆడడానికి థమన్ కూడా ముఖ్య పాత్ర పోషించాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఆ నమ్మకంతోనే బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో కూడా తననే తీసుకున్నట్లు తెలుస్తుంది.

బాలయ్య బర్త్డే సందర్బంగా విడుదలైన ఈ టీజర్ కు ఏ స్థాయిలో థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడో ప్రత్యేకించి చెప్పే పని లేదు. ఇక బాలయ్య సినిమాకు థమన్ కంటె గొప్పగా సంగీతం ఎవరు ఇవ్వరేమో అనేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు.. కాగా ఇప్పుడు బాలయ్య, బాబీతో చేయబోయే సినిమాకు సంగీత దర్శకుడిని మార్చుతున్నట్లు అయితే తెలుస్తుంది. ఈ సారి దేవి శ్రీ ప్రసాద్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.. ఇక వాల్తేరు వీరయ్యకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని బాబీ.. దేవి శ్రీ ప్రసాద్ పేరును రిఫర్ చేసినట్లు సమాచారం.. బాలయ్య కూడా వెంటనే ఒకే చెప్పాడని తెలుస్తుంది.. పైగా ఇప్పుడు థమన్ వరుస సినిమాలతో ఎంతో బిజీ గా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగానే ఆఫర్స్ వున్నాయి.ఈ క్రమంలో చిత్రబృందం దేవి శ్రీ ప్రసాద్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

Show comments