NTV Telugu Site icon

NBK 109 : బాలయ్య, బాబీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Nbk 109

Nbk 109

NBK 109 :నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు..ఈ సినిమా “NBK109 “అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాతలు నాగవంశీ,సాయి సౌజన్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఇటీవల ఎలక్షన్ ప్రచారంలో బిజీ గా వుండి బాలయ్య ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.తాజాగా ఎన్నికలు ముగియడంతో బాలయ్య తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్సె వీడియో రిలీజ్ చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.బాలయ్య మాస్ డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.జూన్ 10 బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ,టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు .ఇదిలా వుంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.అక్టోబర్ 10 న దసరా కానుకగా రిలీజ్ కానుందని సమాచారం.అయితే ఇదే రోజున ఎన్టీఆర్ “దేవర” ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కానీ ఈ సినిమా ఇంకా ముందే రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది .దీనితో బాలయ్య సినిమా ఈ డేట్ కు వస్తున్నట్లు సమాచారం.అయితే బాలయ్య బర్త్డే రోజే మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.