NTV Telugu Site icon

Bala Murugan : రచయిత బాలమురుగన్ కన్నుమూత

Bala Murugan

Bala Murugan

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. తెలుగు సహా తమిళంలో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన తమిళ కథా రచయిత బాలమురుగన్ తుది శ్వాస వీడిచారు. గత కొన్నాళ్లుగా వయోభారం అనారోగ్యంతో రీత్యా ఇబ్బంది పడుతున్న కన్నుమూసినట్లు ఆయన కుమారుడు, తెలుగు-తమిళ సినీ రచయిత భూపతి రాజా మీడియాకు వెల్లడించారు. బాలమురుగన్‌ వయసు 86 సంవత్సరాలు.

Also Read : Shraddha Das: బొడ్డు అందాలతో బంతాడేస్తున్న శ్రద్దా..

అయితే.. తెలుగులో బాలమురుగన్ ధర్మదాత, ఆలుమగలు, సోగ్గాడు, సావాసగాళ్లు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందించారు. అలాగే ఆయన గీతా ఆర్ట్స్ మొదటి సినిమా బంట్రోతు భార్య సినిమాకు కూడా బాల మురుగనే కథ అందించడం విశేషం. ఇక శోభన్ బాబు హీరోగా తెరకెక్కిన సోగ్గాడు సినిమా ఎంత భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమిళంలో స్టార్ హీరోగా ఒకప్పుడు చక్రం తిప్పి శివాజీ గణేషన్ కి దాదాపు 30 నుంచి 40 సినిమాలకు బాలమురుగన్ కథలు అందించారు.

Also Read : Anupama Parameswaran : అనుపమా నీ చూపు.. గుండెలో గునుపమా..

Show comments