Site icon NTV Telugu

NBK111: బాలయ్య సినిమాలో లక్ష్మీ రాయ్.. ఈసారి క్యారెక్టర్ మామూలుగా ఉండదట!

Balakrishna Gopichand Malineni’s #nbk111.

Balakrishna Gopichand Malineni’s #nbk111.

నందమూరి బాలకృష్ణ 111వ చిత్రంలో కాస్టింగ్ పరంగా చిత్ర యూనిట్ భారీ ప్లాన్లే వేస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే మెయిన్ హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార ఖరారు కాగా, ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం బోల్డ్ బ్యూటీ రాయ్ లక్ష్మీ (Raai Laxmi) ఎంపికైనట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి ‘అధినాయకుడు’ సినిమాలో నటించారు, మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండటం విశేషం. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా,

Also Read : Raghavendra Rao: శ్రీదేవి మరణంపై రాఘవేంద్రరావు సెన్సేషనల్ కామెంట్స్!

సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక పవర్‌ఫుల్, ప్రాధాన్యత ఉన్న రోల్ అని తెలుస్తోంది. ఆమె ఎంట్రీతో కథలో కీలక మలుపులు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. సతీష్ కిలారు నిర్మాణంలో, పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ‘వీర సింహా రెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య-గోపీచంద్ మలినేని మళ్ళీ జతకట్టడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉంటుంది.. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం’ అంటూ గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే క్రేజీ బిజినెస్ జరుగుతోంది. రాయ్ లక్ష్మీ లాంటి గ్లామరస్ నటి కూడా తోడవ్వడంతో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు మరింత కలర్ యాడ్ అయినట్లయింది.

Exit mobile version