Site icon NTV Telugu

Ellamma: టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమా..!

Ellamma Movie

Ellamma Movie

Ellamma: హాస్య నటుడిగా మొదలై, దర్శకుడిగా తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు సాధించిన ఈ యువ దర్శకుడు వేణు యెల్దండి. ‘బలగం’ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఈ డైరెక్టర్. ఒక చిన్న గ్రామం.. సరళమైన కథ.. హృదయాన్ని తాకే భావోద్వేగాలు.. ఇవన్నీ కలిసి రూపుదిద్దుకున్న చిత్రమే ‘బలగం’. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి రడీ అయ్యాడు ఈ డైరెక్టర్. తన నెక్స్ట్ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో రాబోతుందని వెల్లడించారు.

READ ALSO: Toxic Movie Teaser: ‘టాక్సిక్‌’ టీజర్‌కు సర్టిఫికేట్అవసరం లేదన్న సెన్సార్ బోర్డు!

తాజాగా వేణు యెల్దండి తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. “జనవరి 15న సాయంత్రం 4:05 గంటలకు ‘ఎల్లమ్మ’ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దిగ్గజ నిర్మాత దిల్ రాజు, సిరిష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, బలగం తర్వాత వేణుకు రెండోది. ఈ సినిమాకు టైటిల్ ‘ఎల్లమ్మ’ అని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ నటిస్తున్నారని టాక్. ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్, హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ డెబ్యూ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ‘ఎల్లమ్మ’పై ఉన్న ప్రచారాలకు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్న గ్లింప్స్‌తో తెరదించే అవకాశం ఉంది. ఈ ‘ఎల్లమ్మ’ సినిమా కూడా .. బలగం మాదిరిగానే మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని వేణు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO: Mahindra XUV 7XO vs Toyota Innova Crysta: 7-సీటర్ కారులో బెస్ట్ ఏదంటే..!

Exit mobile version