Baladitya : ఇటీవల కాలంలో ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య కొద్దిపాటి దూరం ఏర్పడినట్లు అనిపిస్తుండగా దాన్ని దగ్గర చేసే ప్రయత్నాలు కూడ ముమ్మరంగా జరుగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్ లో తన పేరు చెప్పలేదనే కక్ష తోనే ఇలా చేశాడంటూ చాలా మంది భావిస్తున్నారు. కానీ అది ఏమాత్రం నిజం కాదని కొందరు అంటున్నారు. పేరు మర్చిపోవడం తప్పే కానీ అంతమాత్రానా సీఎం స్థాయి వ్యక్తి పగ ప్రతీకారం తీర్చుకునే అవకాశమే లేదు. ఐతే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోకపోయినా ఆయన ఈ ఘటనపై ఇలానే రియాక్ట్ అయ్యి ఉండేవారు. ఎందుకంటే అక్కడ ఓ నిండు ప్రాణం బలైంది. ఇదిలాఉంటే సీఎం రేవంత్ రెడ్డి పేరును ఓ పెద్ద ఈవెంటులో వేదిక మీద మాట్లాడుతూ మర్చిపోయాడు మరో హీరో. గతంలో సినిమాలు చేసి ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన బాలాదిత్య తాజాగా హెచ్.ఐ.సీ.సీ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు సభల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
Read Also:Sankranthiki Vasthunam Trailer: పండుగ ముందే తెచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’
ఆ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి అతిథిగా వచ్చారు. ఈ క్రమంలో యాంకర్ గా చేస్తున్న బాలాదిత్య మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారికి స్వాగతమన్నారు. సీఎం కిరణ్ కుమార్ అనగానే అక్కడ ఉన్న వారంతా పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఐతే వెంటనే తన తప్పు తెలుసుకున్న బాలాదిత్య క్షమించాలి అంటూ మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతమన్నారు. సీఎం పేరు అది కూడా సినిమా వాళ్లు మళ్లీ మళ్లీ మర్చిపోవడం లాంటివి సీఎం రేవంత్ రెడ్డి అభిమానులకు మింగుడు పడడం లేదు. ఏదైనా ఈవెంట్ జరగుతుందంటే చాలా అలర్ట్ గా ఉండాలి. అలా కాకుండా టెన్షన్ లో ఏదో ఒకటి మాట్లాడేస్తే ట్రోల్ మెటీరియల్ అవుతారు. ప్రస్తుతం బాలాదిత్య పరిస్థితి అలాగే అయింది. నెట్టింట్లో ఆయనను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. రేవంత్ రెడ్డి విషయంలోనే ఇలా రెండు సార్లు జరగడంపై ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
Read Also:Anchor Shyamala: SEIZE THE ROAD… అనాలి కదా?.. పవన్ కు యాంకర్ శ్యామల చురకలు