Site icon NTV Telugu

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఈ నేపథ్యంలో ఎల్‌ రమణ స్థానంలో బక్కని నర్సింహులును నియమించారు చంద్రబాబు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన బక్కని నర్సింహులు… 1994-99 లో షాద్‌ నగర్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.

read also : టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా కలవరం

ఈ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బక్కని నర్సింహులును అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు. ఇక నియామకంపై బక్కని నర్సింహులు మాట్లాడుతూ… తెలంగాణ లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని… యువకులకు అవకాశం ఇస్తామన్నారు.మా పార్టీలో గెలిచిన వాళ్ళను ఎత్తుకుపోయారని… ప్రాణం ఉన్నంత వరకు తాను టిడిపిలోనే ఉంటానని స్పష్టం చేశారు.

Exit mobile version