NTV Telugu Site icon

Bajaj Bikes: ఇకపై ఆ పాపులర్ బైకులు రోడ్లపై కనుమరుగు

Bajaj

Bajaj

Bajaj Bikes: భారతీయ టూ-వీలర్ మార్కెట్లో బజాజ్ సంస్థ దూకుడుగా ముందుకు సాగుతూ వస్తోంది. ఈ సంస్థ ఉత్పత్తులలో ముఖ్యంగా పల్సర్, ప్లాటినా వంటి బైకులు సామాన్యులలో మంచి ప్రాధాన్యం పొందాయి. అయితే, తాజాగా బజాజ్ సంస్థ కొన్ని బైకుల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో పాపులర్ మోడల్స్ కూడా ఉన్నాయి. మరి ఆ మోడల్స్ ఏంటి? ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమున్నాయో చూద్దాం.

Also Read: Maharaja : అక్కడ ‘బాహుబలి 2’ రికార్డు బద్దలుకొట్టిన మహారాజ..!

బజాజ్ ప్లాటినా 100 సీసీ బైక్ మైలేజీ పరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. 90-100 kmpl మైలేజీతో ఈ బైక్ టూ-వీలర్ మార్కెట్లో మంచి పేరు సంపాదించింది. బజాజ్ ప్లాటినా 100 సీసీ బైక్ 100 సీసీ సెగ్మెంట్‌లో హీరో స్ప్లెండర్‌ బైకుకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే, ఆ తర్వాత 10 సీసీతో వచ్చిన ప్లాటినా మోడల్ కూడా బాగా పాపులర్ అయ్యింది. అయితే, బజాజ్ సంస్థ తాజాగా ప్రకటించిన బైకులలో 110 సీసీ ప్లాటినా మోడల్ కూడా ఒకటి. 110 సీసీ ప్లాటినా మోడల్ బైకుల తయారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణలలో ఒకటి ఈ మోడల్ అంతగా సేల్స్‌లో పురోగతి సాధించకపోవడం.

Also Read: HMPV Virus: భారత్‌లో 6కి చేరిన HMPV కేసులు.. ఎక్కడంటే..

అలాగే కంపెనీ తీసుకున్న కీలక నిర్ణయలలో బజాజ్ పల్సర్ F250 స్పోర్ట్స్ బైక్‌ కూడా ఉంది. ఇది బజాజ్ బైక్‌లలోని అత్యంత ప్రాచుర్యం పొందిన మోడల్. అలాగే, ప్లాటినా సీటీ125X కూడా నిలిపివేయబడిన మోడల్స్ జాబితాలో ఉంది. ఈ బైకులు నాలుగేళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చినప్పటికీ, అంచనాల మేరకు సేల్స్‌ను సాధించలేకపోయాయి. ఇక ప్లాటినా 110 సీసీ ఏబీఎస్ (Anti-Lock Braking System) మాత్రం 2022లో విడుదలైంది. బజాజ్ సంస్థ తన బైక్‌ల తయారీని నిలిపివేయడం వెనుక ఉన్న కారణం కొన్ని మోడల్‌లు మార్కెట్లో అనుకున్న అమ్మకాల లక్ష్యాలను సాధించలేకపోవడమే. అయితే, బజాజ్ ఈ నిర్ణయంతో మార్కెట్లో నూతన మార్పులను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతుంది.

Show comments