ఇల్లు కొనాలనుకునే వారి కోసం బజాజ్ హౌజింగ్ ఫినాన్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్ హోమ్‌లోన్ అప్లికేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. దీంతో కేవలం వాట్సాప్ ద్వారా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి ఇంటి రుణాల కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ సౌకర్యం ఫిబ్రవరి 6 నుంచి అందుబాటులోకి వచ్చింది.
Also Read: Girl On Marriage: అతడ్ని పెళ్లి చేసుకోవచ్చా.. యువతి ప్రశ్న, నెట్టింట దుమారం
అర్హత గల రుణ గ్రహీత ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సరైన వివరాలను సమర్పించడం ద్వారా హోమ్‌లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. హోమ్ లోన్ కోసం అప్లై చేయాలి అనుకునేవారు వాట్సాప్ ద్వారా తాజా గృహ రుణం, గృహరుణం బ్యాలెన్స్ బదిలీ.. రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. దరఖాస్తు చేసేటప్పుడు.. దరఖాస్తుదారు పేరు, మొబైల్ నంబర్, పాన్ మొదలైన వాటితో సహా కొన్ని వివరాలు మాత్రమే అవసరం. వివరాలను అందించిన తర్వాత కస్టమర్ తక్షణమే వారి అర్హత, ఆఫర్ మొత్తాన్ని తనిఖీ చేయొచ్చు. ఆసక్తి ఉన్నవారు రూ.1,999+జీఎస్‌టీ చెల్లించి ‘డిజిటల్ ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్’ను పొందొచ్చు.
Also Read: Ravi Ashwin: బాయ్స్‌కు ‘B’తో స్టార్ట్ అయ్యేదే కావాలన్న అమ్మాయి..అశ్విన్ దిమ్మతిరిగే ఆన్సర్
దరఖాస్తు విధానం..
బజాజ్ హోమ్‌లోన్స్‌కు సంబంధించిన వాట్సాప్ నంబర్ ‘75075 07315’కు ‘Hi’ అని సందేశం పంపండి. మీ గృహ రుణ అర్హతను తనిఖీ చేయడానికి ఎనిమిది వివరాలను తెలపాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనవి పేరు, సంప్రదించే ఫోన్ నెంబర్లు, పాన్ మొదలైన వాటిని తెలపాలి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌లో అర్హతగల దరఖాస్తుదారులకు సంవత్సరానికి 8.60% నుంచి గృహ రుణ వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయి.