Site icon NTV Telugu

Bajaj Freedom 125: మొట్టమొదటి CNG బైకు ‘బజాజ్ ఫ్రీడమ్ 125’ ధర భారీగా తగ్గింపు..!

Bajaj Freedom 125

Bajaj Freedom 125

Bajaj Freedom 125: బజాజ్ ఆటో రూపొందించిన ప్రపంచంలోనే తొలి CNG మోటార్‌సైకిల్ అయిన ఫ్రీడమ్ 125 తన తొలి వార్షికోత్సవాన్ని చేరుకుంటున్న నేపథ్యంలో.. కంపెనీ దీనికి సంబంధించి ధరలలో తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా, ఎంట్రీ లెవల్ డ్రమ్ వేరియంట్‌పై రూ. 5,000 డిస్కౌంట్ ప్రకటించడంతో, ఇప్పుడు దీని ప్రారంభ ధర రూ. 85,976 (ఎక్స్‌షోరూమ్) లకే లభిస్తోంది. మిగతా రెండు వేరియంట్లు వరుసగా రూ. 95,981, రూ. 1.11 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి.

Read Also: MLC Addanki Dayakar: కవిత మాటల వెనుక కేసీఆర్ ఉన్నాడు.. వాళ్ళది ఫ్యామిలీ డ్రామా

ఈ బైకు పెట్రోల్ కాకుండా CNG పై నడుస్తుంది, తద్వారా ఇంధన ఖర్చులను గణనీయంగా తగ్గించగలదు. వాతావరణ హితంగా ఉండటంతో పాటు, వాడకదారుల కోసం ఆర్థికంగా కూడా సానుకూలంగా ఉంటుంది. ఈ ధర తగ్గింపుతో బజాజ్ ఫ్రీడమ్ 125 మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్‌గా మారింది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, సమర్థవంతమైన ఎల్టర్నేటివ్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది.

Read Also: War 2: ‘వార్ 2’ కథ’కి చాలా సమయం!

బజాజ్ ఆటో రూపొందించిన ఫ్రీడమ్ 125 ప్రపంచంలో మొట్టమొదటి CNG + పెట్రోల్ డ్యూయల్ ఫ్యూయల్ టెక్నాలజీ మోటార్‌సైకిల్‌గా నిలిచింది. ఇందులో 125cc, ఏయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది CNG, పెట్రోల్ రెండింటినీ ఫ్యూయల్‌గా ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 9.5 PS పవర్ వద్ద 8000 RPM, 9.7 Nm టార్క్ 5000 RPM వద్ద అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్, సోఫ్ట్-డ్యూయల్ రైడింగ్ సీట్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, నైట్రో షాక్ అబ్సార్బర్‌తో రియర్ సస్పెన్షన్ వంటివి ఉంటాయి. సురక్షిత బ్రేకింగ్ కోసం ముందు చక్రానికి 245mm డిస్క్ బ్రేక్ లేదా డ్రమ్ బ్రేక్ ఎంపికలున్నాయి. వెనుకవైపు 130mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది.

ఒకసారి CNG నింపితే దాదాపు 200 కి.మీ వరకు మైలేజ్ అందించగలదు. ఈ బైక్‌లో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 2 కేజీల సామర్థ్యం గల CNG ట్యాంక్ ఉంటాయి. స్టైలింగ్ విషయానికి వస్తే, ఇందులో LED DRLs, డ్యూయల్ టోన్ గ్రాఫిక్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే, బజాజ్ ఫ్రీడమ్ 125 అనేది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే, పర్యావరణహితమైన, ఆధునిక టెక్నాలజీతో కూడిన బైక్. ఇది నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అద్భుత ఎంపిక.

Exit mobile version