ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఏప్రిల్ 8 న ఆయన పుట్టినరోజు.. హీరో బర్త్ డే సందర్బంగా పుష్ప 2 నుంచి టీజర్ రిలీజ్ కాబోతుంది.. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15 గ్రాండ్ గా విడుదల కాబోతుంది..ఈ సినిమా పుష్ప కు సీక్వెల్ గా రానుంది.. మొదటి పార్ట్ ను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేశారు.. ఆ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.. ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు..
ఇక బన్నీ బర్త్ డే సందర్బంగా మూవీ అప్డేట్స్ మాత్రమే కాదు..తన కెరియర్‌లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన జులాయి, ఆర్య 2సినిమాలను మళ్లీ రిలీజ్ చెయ్యనున్నారని వార్తలు వినిపించాయి.. కానీ ఇప్పుడు విడుదల చెయ్యడం లేదని వార్త వినిపిస్తుంది.. ఆర్య2 – ముందుగా అనుకున్న ప్రకారం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 08న రీ-రిలీజ్ కావడం లేదు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నారు. జులాయి స్పెషల్ షోల స్క్రీనింగ్ ప్లాన్ కూడా ఆగిపోయింది..
ఈ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. ఈ వార్తతో నిరాశలో ఉన్నారు.. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా కొత్త సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి.. తమిళ అట్లీతో సినిమా ప్రకటన కూడా రానుందని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం..
