Site icon NTV Telugu

Back-to-Back Murders: అనంతపురంలో వరుస హత్యల కలకలం..

Back To Back Murders

Back To Back Murders

అనంతపురంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో … రెండు హత్యలు ఒకేలా జరగడం సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు హత్యలకు ఓకే రకమైన ఆయుధాన్ని ఉపయోగించడం పోలీసులకు సవాలుగా మారింది.
అనంతపురంలో పగ.. ఆవేశం ఇద్దరి ప్రాణాలు తీశాయి. కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరిని హత్య చేశారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు చిదానంద. ఇతనికి భార్యతో 9 నెలల క్రితం గొడవ జరిగింది. ఆ సమయంలో భార్య మృతి చెందింది. దీంతో ఆ కేసులో గార్లదిన్నె పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇటీవల బయటకొచ్చిన చిదానంద… ఊరు విడిచిపెట్టి అనంతపురంలోని కిరాణా దుకాణంలో పని చేస్తూ జీవిస్తున్నాడు. ఐతే అతనిపై బళ్లారి బైపాస్‌లోని అన్న క్యాంటీన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బండరాయితో మోది హత్య చేశారు..

READ MORE: Fake Liquor Factory: కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్‌తో ఇంట్లోనే మద్యం తయారీ.. చివరికీ..

అయితే మృతుని తల్లి మాత్రం ఈ హత్య.. చిదానంద భార్య బంధువులే చేశారని ఆరోపించారు. ఇటీవల భార్య అనుమానాస్పద మృతి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చిదానందపై కసి పెంచుకొని హత్య చేశారని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకు కుటుంబ కలహాలే కారణమా? మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కళ్యాణదుర్గం రోడ్‌లో సురేష్ బాబు, అనిత హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే 2 నెలల క్రితం అనితకు ఫక్రుద్దీన్ అనే ఒక పండ్లు అమ్ముకునే వ్యక్తి పరిచమయ్యాడు. అది కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయంలో సురేష్ బాబుకు అనుమానం రావడంతో మద్యం సేవించి అనితను వేధించసాగాడు.

READ MORE: Hyderabad: ఓయో రూంలో యువతి మృతదేహం.. ఇది హత్యా.. ఆత్మహత్యా..?

తమ సంబంధానికి భర్త సురేష్ బాబు అడ్డుగా ఉన్నాడని ఫక్రుద్దీన్‌తో చెప్పింది అనిత. దీంతో ఎలాగైనా అతన్ని అడ్డు తొలగించుకుంటే సంతోషంగా ఉండవచ్చని హత్యకు ఉసిగొల్పింది. ఫక్రుద్దీన్.. సురేష్ బాబు హోటల్ మూసివేసి.. ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఖాళీ సీసా విసిరి దాడి చేశాడు. వెంటనే కింద పడ్డ సురేష్ బాబుని స్క్రూ డ్రైవర్‌తో పొడిచాడు. ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేశాడు.. ఈ రెండు హత్యలు కారణాలు ఏవైనప్పటికీ తక్కువ వ్యవధిలోనే 2 మర్డర్లు జరగడం మాత్రం అనంతపురం జిల్లాలో కలకలం రేపుతోంది. అదీ కాకుండా రెండు హత్యల్లో బండరాయినే మారణాయుధంగా వాడారు..

Exit mobile version