Site icon NTV Telugu

BachhalaMalli : ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకోసం తగ్గాలి.. నరేష్ మాస్ యాక్షన్ మాములుగా లేదుగా..

Bachhalamalli22

Bachhalamalli22

BachhalaMalli : హీరో అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న సినిమా ” బచ్చల మల్లి “. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరక్కేక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్లో నరేష్ మాస్ లుక్ లో అదరగొట్టాడు. తాజాగా బచ్చల మల్లి సినిమాకు సంబంధించి టీజర్ గ్లిమ్స్ ను విడుదల చేశారు సినీ బృందం. ఈ సినిమాకు సుబ్బు మంగదెవ్వి దర్శకత్వం చేస్తున్నారు.

T20 World Cup 2024: భారత్ విజయంపై హర్షం వ్యక్తం చేసిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల

ఇప్పటికే అల్లరి నరేష్ నటించిన రెండు సినిమాలు ఈ సంవత్సరం విడుదల అయ్యాయి. నాగార్జున హీరోగా తెరకెక్కిన : నా సామిరంగా ” సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్ర పోషించగా… ” ఆ ఒక్కటి అడక్కు ” అంటూ నరేష్ హీరోగా మరో సినిమా ప్రేక్షకుల ముందు వచ్చిన సంగతి తెలిసిందే. వీటి తర్వాత ఈ ఏడాది మరోసారి ప్రేక్షకుల ముందుకు బచ్చల మల్లిగా నరేష్ మాస్ లుక్కుతో రానున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ గ్లిమ్స్ లో నరేష్ ఊర మాస్ క్యారెక్టర్ ను పోషించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నరేష్ ను ఇదివరకు ఎప్పుడు చూడని విధంగా దర్శకుడు బచ్చల మల్లిగా అల్లరి నరేష్ ను చూపించబోతున్నాడు. ముఖ్యంగా ” ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకోసం తగ్గాలి.. ” అనే మాస్ డైలాగ్ తో టీజర్ ను మరో లెవెల్కు తీసుకువెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది.

Ramesh Rathod: ఉట్నూర్ లో నేడు మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ అంత్యక్రియలు..

Exit mobile version