Bengal Couple Sells off Son to buy iPhone 14: కన్న బిడ్డకు ఆకలి వేసినా లేదా చిన్న దెబ్బ తగిలినా.. తల్లిదండ్రులు చలించిపోతారు. బిడ్డ చికిత్సకు చేతిలో డబ్బు లేకపోతే నగలు, ఇల్లు, పొలాలు అమ్మడానికి కూడా వెనకాడరు. కడుపున పుట్టిన వారి కోసం ఏమైనా త్యాగం చేయడనికి సిద్ధపడుతారు. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఓ తల్లిదండ్రులు సమాజం తలదించుకునే పనిచేశారు. సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడానికి ఖరీదైన ‘ఐఫోన్’ కొనాలనుకుని.. డబ్బుల కోసం ఏకంగా కన్న బిడ్డనే అమ్మేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బెంగాల్‌లో ఉత్తర 24 పరగణాల జిల్లా పానిహతిలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన జయదేవ్, సాథి దంపతులకు 7 ఏళ్ల కూతురు, 8 నెలల కొడుకు ఉన్నారు. స్థానికులకు కొద్దిరోజులుగా కుమారుడు కనిపించలేదు. భార్యభర్తల ప్రవర్తనలో మార్పు రావడం చుట్టుపక్కల ఉండే వారికి అనుమానం కలిగింది. దీనికి తోడు ఆ దంపతులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లి.. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వారికి అనుమానం రెట్టింపు అయింది.
Also Read: Ravindra Jadeja Recod: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. తొలి భారత బౌలర్‌గా అరుదైన రికార్డు!
జయదేవ్, సాథి దంపతులను కుమారుడు ఏమయ్యాడని చుట్టుపక్కల వారు ప్రశ్నించగా.. అమ్మేసినట్లు తెలిపారు. ఆ డబ్బుతో ఐఫోన్ కొన్నట్లు సెప్పరూ. దీంతో చుట్టుపక్కల వారు వారిని బాగా తిట్టి.. పోలీసులకు సమాచారం అందించారు. జయదేవ్, సాథి దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రీల్స్ చేసేందుకు ఐఫోన్ కొనాలని.. కుమారుడిని ఖార్‌దాహ్ ప్రాంతంలో నివసించే ప్రియాంక అనే మహిళకు అమ్మేసినట్లు తెలిపారు.
కుమారుడిని అమ్మిన తర్వాత కుమార్తెను కూడా అమ్మేందుకు జయదేవ్ ప్రయత్నించాడని, అందుకే పోలీసులకు సమాచారం అందించామని స్థానిక కౌన్సిలర్ తారక్ గుహ తెలిపారు. జయదేవ్, సాథి దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారితో పాటు కుమారుడిని కొనుగోలు చేసిన మహిళను కూడా అరెస్టు చేశారు. ఐఫోన్ కోసం కన్న కొడుకునే అమ్మేసిన ఆ దంపతుల చర్య సభ్యసమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: Captain Miller Teaser: ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ వచ్చేసింది.. ధనుష్ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోలా!