NTV Telugu Site icon

Baby Girl Adoption: తాము ఉద్యోగం చేసుకోవాలి.. మా కుమార్తెను దత్తత తీసుకోండి అంటున్న జంట..!

9

9

ఈ మధ్యకాలంలో అనేకమంది యువత వారి కెరియర్ కోసం ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడిపోతున్నారు. ఈ నిబంధనలో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటుండగా మరి కొందరు ఇంట్లో వాళ్ళ కోసం వివాహాలు చేసుకుంటున్నారు. అయితే వివాహం తర్వాత పిల్లల విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే వారు కన్న సొంత పిల్లలను సైతం తమ ఎదుగుదలకు అడ్డంగా భావిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ఇకపోతే తాజాగా ఓ జంట సోషల్ మీడియా ద్వారా తమ మూడు నెలల కుమార్తె ఎలిజిబెత్ ను తాము దత్తత ఇద్దామనుకుంటున్నట్లు వారు ప్రకటించారు. అయితే ఈ విషయంపై వారు ఇచ్చిన కారణం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read: Tillu Square Collections : దుమ్ముదులిపేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ.. 5 రోజులకు ఎన్ని కోట్లంటే?

దంపతులు ఇద్దరు వారి ఉద్యోగాలలో బిజీగా ఉండడం కారణంతో పాపను చూసుకోవడానికి సమయం సరిపోవట్లేదని.. సదరు చిన్నారి తండ్రి సోషల్ మీడియా పూర్వకంగా విషయాన్ని తెలిపారు. తామిద్దరం ఆఫీస్ పనులలో బిజీగా ఉండడంతో తమ కుమార్తె ఎలిజిబెత్ కు కావలసిన అవసరాన్ని తాము సమకూర్చుకోవడానికి ఆఫీస్ పనిని వదిలేయాల్సి వస్తుందని దాంతో తాము వర్క్ హాలిక్ లైనా మేము అలా చేయలేకపోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

Also read: Rahul Gandhi: వయనాడ్ లోక్సభ స్థానానికి నేడు రాహుల్ గాంధీ నామినేషన్

ఇక పాప విషయంలో తన భార్య దుస్తులు మార్చడం, పాలు పట్టించడం, స్నానం చేయించడం తప్ప తాను ఇంకేమీ చేయడం లేదని చెప్తూనే.. ఇప్పటివరకు కూతురితో సమయం గడపలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ చిన్నారిని వారి అమ్మమ్మ చూసుకుంటున్నట్లు తెలిపారు. బిడ్డకు జన్మనిచ్చిన రెండు వారాల్లోనే తన భార్య తిరిగి ఉద్యోగంలో చేరిందని చెబుతూ అది తనకున్న నిబద్ధత అంటే తెలిపారు. అయితే ముందుగా వారి చిన్నారిని అమ్మమ్మ గారిని కుటుంబంలోని వేరే ఎవరైనా దత్తత తీసుకోవాల్సిందిగా వారు కోరారు. అలాంటి సమయంలో వారు ముందుకు రాకపోతే తాము ఇతరులకు ఎవరికైనా దత్తత ఇస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పోస్టు వైరల్ కావడం నెటిజన్స్ ఈ దంపతులపై పెద్ద ఎత్తున ఆగ్రహం తెలుపుతున్నారు. భర్త చేసిన పోస్ట్ టార్గెట్ చేస్తూ తల్లిదండ్రులకు వారి పిల్లలపై ఉండాల్సిన బాధ్యత గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. మరికొందరు కామెంట్ చేస్తూ.. మీరు ఏమైనా రోబోలా లేదా మానవ జీవితాలతో ప్రయోగాలు చేస్తున్న గ్రహాంతరవాసుల అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

Show comments