NTV Telugu Site icon

Viral News: హనుమంతుడు మళ్లీ పుట్టాడు రుజువుకావాలా..?

Baby Tail

Baby Tail

Viral News: మనుషులు కోతుల నుంచి వచ్చారని అందరికీ తెలుసు.. అప్పుడు వాటికి తోకలుండేవి.. కాలక్రమేణా ఆ తోకలు మాయమైపోయాయి. ఇప్పుడు మళ్లీ మనుషులు తోకలతో జన్మిస్తున్నారన్న వార్తలు అడపాదడపా వార్తల్లో నిలుస్తున్నాయి. జన్యులోపాల కారణంగానే ఇలా జరుగుందని వైద్యులు పేర్కొంటున్నారు. మెక్సికోలో ఓ చిన్నారి తోకతో జన్మించింది. ప్రస్తుతం ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తోకతో పుట్టిన పాప పూర్తి ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. తోకను సూదితో తాకినప్పుడు చిన్నారి ఏడ్చిందని వైద్యులు చెప్పారు. రెండు నెలల తర్వాత దాన్ని చిన్న సర్జరీ చేసి తొలగించినట్లు తెలిపారు. అదే రోజు పాపను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పాపకు ఎటువంటి సమస్యలు లేవన్నారు. సాధారణంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లల్లో తోక ఏర్పడుతుందని, కానీ తొమ్మిది నెలల తర్వాత అది ఎముకగా మారి లోపలికి వెళ్లిపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

Read Also: Woman Kills Husband: శ్రద్ధా వాకర్ తరహాలో.. భర్తని చంపి, ముక్కలుగా చేసి..

కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం తోకతో పుడతారని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి ఇలా తోకతో జన్మించిన శిశువుల సంఖ్య 195గా ఉంది. అయితే మెక్సిలో మాత్రం ఇదే తొలి కేసు. ఎక్కువగా మగ శిశువులకు ఇలా జరుగుతుంది. మెదడు, పుర్రె వృద్ధి సమస్యల ప్రభావంతోనే చిన్నారులు ఇలా తోకతో జన్మిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. కానీ వైద్యులు మాత్రం దీనికి కచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. పాప తోక ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా కొన్ని రోజులు క్రితం నేపాల్లో దేశాంత్ అధికారి అనే కుర్రవాడికి ఏకంగా 70 సెంటీ మీటర్ల పొడవున్న తోక ఉంది. దానిని తొలగించేందుకు చాలా ఆస్పత్రులకు తిరిగారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తర్వాత దేశాంత్ హనుమంతుడి పునర్జన్మ అని ఓ పూజారి చెప్పడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. అతడి తోకను అలాగే వదిలేశారు. కానీ ఆ తోక వల్ల దేశాంత్ అధికారి చాలా ఇబ్బందులు పడ్డాడంట. దేశాంత్ తోక గురించి యూట్యూబ్ ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది.