Site icon NTV Telugu

Baby : ఓటీటీ లో దుమ్మురేపుతున్న బ్లాక్ బస్టర్ మూవీ..

Whatsapp Image 2023 08 26 At 11.02.49 Am

Whatsapp Image 2023 08 26 At 11.02.49 Am

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. చిన్న సినిమాగా విడుదల అయిన బేబీ చిత్రం సంచలన విజయం సాధించింది. చిత్రం భారీ వసూళ్లు సాధించింది.యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ నటనను అందరూ మెచ్చుకున్నారు. జులై 14న ఈ చిత్రం విడుదల కాగా..అదిరిపోయే టాక్ తో అద్భుత విజయం సాధించింది.అయితే ఈ చిత్రంలో వైష్ణవి నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి.. తనకి ఇచ్చిన క్యారెక్టర్ లో ఈ భామ ఒదిగిపోయింది. ఈ సినిమాతో ఈ భామకు టాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది .

బేబీ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్లింది. సుమారు 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం భారీ లాభాలు తెచ్చిపెట్టింది. రూ.80 కోట్లపైగానే కలెక్షన్స్ సాధించింది. తక్కువ బడ్జెట్ తో తీసినా కూడా కథ బాగుంటే.. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ సినిమా నిరూపించింది.అయితే బేబీ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాను ఎస్కేఎన్ నిర్మించారు. బేబీ సినిమా థియేటర్ రన్ పూర్తి అయింది.దీనితో ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూసారు.. నిన్నటితో ప్రేక్షకుల నిరీక్షణకు తెర పడింది. బేబీ సినిమా ఆగస్టు 25 నుంచి ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్ లో అద్భుత విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ లో కూడా దుమ్మురేపుతుంది.ఈ సినిమా ఆహా ఓటీటీ లో విడుదల అయిన 32 గంటలలోనే అత్యంత వేగంగా 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పొందినట్లు ఆహా వెల్లడించింది.బేబీ సినిమా తీన్మార్ మ్రోగింది అంటూ కాప్షన్ కూడా ఇచ్చింది..

https://twitter.com/ahavideoIN/status/1695277610752963016?s=20

Exit mobile version