బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కాదు మోసం గ్యారెంటీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు మోసాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి బాబు షూరిటీ- మోసం గ్యారెంటీ కార్యక్రమం చేపట్టామన్నారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. గుడివాడలో కార్యక్రమానికి నాయకులను రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ హారికను పోలీసులు అడ్డుకున్నారన్నారు. రాళ్లు, కర్రలతో దాడిచేశారని.. దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. పోలీసులకు రక్షణ కల్పించాల్సిన పనిలేదా? అని ప్రశ్నించారు. హారికపై దాడికి హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
READ MORE: Smart Phones: ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లపై వేలల్లో డిస్కౌంట్.. ఇప్పుడు కొంటే లాభం!
వైసీపీ ఏదైనా కార్యక్రమం చేపడితే పోలీసులను అడ్డుపెట్టుకుని అణిచివెయ్యాలని చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. “పెడనలో కార్యక్రమం చేపడితే అక్కడకు పోలీసులు వచ్చారు. రాజకీయ పార్టీలు వారి కార్యక్రమాలు చేసుకోకూడదా. సైకోల్లా దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులే. నల్లపరెడ్డి ప్రసన్న ఇంటిపై దాడిచేశారు. హారికపై దాడి ఘటనపై ప్రభుత్వం, పోలీసులు చర్యలు చేపట్టాలి. దాడులకు పాల్పడుతున్న టీడీపీ గూండాలపై చట్టపరంగా చర్యలు చేపట్టాలి. దాడుల ఘటనలపై డీజీపీ అసలు చర్యలు తీసుకోవడంలేదు.” అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Bihar: బీహార్‌లో కాల్పుల కలకలం, 24 గంటల్లో నలుగురి హత్య..
