Site icon NTV Telugu

Pakistan vs India T20 2026: బాబర్ అజామ్ లేకుండా భారత్‌తో పాక్ మ్యాచ్? కారణం ఇదే!

Babar Azam

Babar Azam

Pakistan vs India T20 2026: భారత్ – పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఇరు జట్లు కొలంబోకు చేరుకున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు తమ అభిమాన స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ భారత్‌పై బాగా రాణిస్తాడని, చాలా పరుగులు చేస్తాడని అనుకుంటున్న సమయంలో వారికి గట్టి షాక్ తగిలే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. USAతో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ బాబర్ 32 బంతుల్లో 143.75 స్ట్రైక్ రేట్‌తో 46 పరుగులు చేశాడు. అయితే ఈ పాక్ బ్యాట్స్‌మెన్‌కు భారత్‌తో జరిగిన T20 మ్యాచ్‌ల్లో అంతగా ఆకట్టుకునే రికార్డు లేకపోవడంతో విశ్రాంతి ఇవ్వవచ్చనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. బాబర్ స్థానంలో, గత మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కని అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ ఫఖర్ జమాన్‌కు అవకాశం లభించవచ్చని చెబుతున్నారు. జమాన్‌కు T20 ఫార్మాట్‌లో బాబర్ అజామ్ కంటే మెరుగైన స్ట్రైక్ రేట్ ఉంది.

READ ALSO: Pakistani Beggars: దుబాయ్‌లో పాకిస్తానీ బిచ్చగాళ్ల దుకాణం క్లోజ్.. బిచ్చగాడి నుండి లక్షల రూపాయలు స్వాధీనం

బాబర్ ఆజం భారత్‌తో మొత్తం ఐదు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌లలో 128.04 స్ట్రైక్ రేట్‌, 26.25 సగటుతో 105 పరుగులు చేశాడు. భారతదేశంపై అతని అత్యధిక ఇన్నింగ్స్ 68 పరుగులు, ఈ స్కోర్‌ను అతను 2021 T20 ప్రపంచ కప్‌లో నమోదు చేశాడు. ఫఖర్ జమాన్ ఆటతీరు గురించి చెప్పాలంటే, భారత్‌పై అతని రికార్డు అంతగా ఆకట్టుకోలేదు. అయితే, అతను తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో అనేక సందర్భాల్లో జట్టును విజయపథంలో నడిపించాడు. అందుకే పాకిస్థాన్ క్రికెట్ నిపుణులు, అభిమానులు అతన్ని నంబర్ నాల్గవ స్థానానికి బలమైన పోటీదారుగా భావిస్తున్నారు. ఇప్పటి ఆయన పాకిస్థాన్ తరపున 117 మ్యాచ్‌లు ఆడి 108 ఇన్నింగ్స్‌లలో 2385 పరుగులు చేశాడు.

ఉస్మాన్ తారిక్‌ను కూడా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి పాకిస్థాన్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు బ్యాట్, బంతి రెండింటితోనూ మ్యాచ్ గమనాన్ని మార్చడంలో నిష్ణాతులు. ఈ జాబితాలో సైమ్ అయూబ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్‌ల పేర్లు కూడా ఉంటాయి. వీళ్లతో పాటు ‘మిస్టరీ’ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, కెప్టెన్ అఘా సల్మాన్ కూడా అవసరమైనప్పుడు బౌలింగ్ చేయడంలో కూడా నిష్ణాతుడు. ఆర్. ప్రేమదాస స్టేడియం స్పిన్నర్లకు అనుకూలమైన స్టేడియంగా చెబుతున్నారు. అదే టైంలో ఫాస్ట్ బౌలింగ్‌కు కూడా అనుకూలించవచ్చని చెబుతున్నారు. పాకిస్థాన్ జట్టులో ఇప్పటికే స్పిన్నర్లతో కూడిన భారీ లైనప్‌ ఉంది. దీంతో స్టార్టింగ్ ఓవర్లను దృష్టిలో ఉంచుకుని, కోచ్, కెప్టెన్లు నసీమ్ షాతో సహా ఇద్దరు ప్రొఫెషనల్ ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Maha Shivaratri 2026: ఈ 4 రాశుల వారికి శివయ్య ఆశీస్సులు.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!

Exit mobile version