Baba Chaitanyananda Saraswati: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద సరస్వతికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. బాబా చైతన్యానంద సరస్వతికి సంబంధించి నివాసాల్లో సోదాలు జరపగా.. నేరారోపణకు సంబంధించిన సామాగ్రి దొరికింది. దర్యాప్తులో భాగంగా నేడు పోలీసు బృందం బాబాతో కలిసి ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లింది. ఆ ప్రాంగణంలో రెండవసారి సోదాలు నిర్వహించింది. పోలీసులు ఒక సెక్స్ టాయ్, ఐదు అశ్లీల వీడియో సీడీలు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, UK మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్‌లతో బాబా చైతన్యానంద సరస్వతి నకిలీ ఫొటోలు కనుగొన్నారు. అంతేకాదు.. అనేక నేరారోపణ పదార్థాలను సైతం కనుగొన్నట్లు గుర్తించారు.
READ MORE: AUS vs NZ: సిక్సర్లతో చెలరేగిన మిచెల్ మార్ష్.. కివీస్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం..
ఇదిలా ఉండగా.. 17 మంది విద్యార్థులను వేధించాడనే ఆరోపణలతో చైతన్యానందను ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఆగ్రాలోని తాజ్ గంజ్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా తప్పించుకుని బృందావన్, మధుర, ఆగ్రాలలో చైతన్యానంద సరస్వతి తిరుగుతూ వచ్చాడు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చైతన్యానంద సరస్వతి సెప్టెంబర్ 27న పార్థ సారథి అనే పేరుతో ఆగ్రాలోని ఒక హోటల్‌లో బస చేశాడు. అక్కడే పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు.