ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నాస్తికుడు భైరి నరేష్‌ను అయ్యప్ప స్వాములు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ ఏటూరు నాగారం మండల కేంద్రంలో డియర్ ఫంక్షన్ హాల్లో జరిగే భీంరావ్ కోరేగావ్ సమావేశానికి నరేష్ వచ్చాడు.. అయితే, అతడి కారు వేగంగా వెళ్లడంతో ఓ అయ్యప్ప భక్తుడు నరసింహరావు కాలికి స్వల్ప గాయాల అయ్యాయి. దీంతో అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అతడిపై దాడి చేసేందుకు అయ్యప్ప భక్తులు యత్నించడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక, విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అయ్యప్ప స్వాములు నిరసన చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి వెంటనే బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Telangana: ములుగులో ఉద్రిక్తత.. నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప స్వాముల దాడికి యత్నం..

Bairi Naresh