Site icon NTV Telugu

Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్య కోసం 108 అడుగుల పొడవు అగరుబత్తీ…

Ayodhya

Ayodhya

భారతీయుల ఆత్మ బంధువు రామయ్య కు అయోధ్య గుడి నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఈ మందిరాన్ని చూడటానికి యావత్ ప్రజానీకం ఎదురు చూస్తున్నారు.. ప్రజలందరి విరాళాల తో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ఆలయ నిర్మాణం పూర్తి కావొస్తుంది.. అయితే రామయ్య భక్తులు ఒక్కొక్కరు ఒక్కోక్క వస్తువును, పూజకు సంబందించిన వస్తువులను విరాళంగా ఇస్తున్నారు.. ఈ మేరకు ఓ భక్తుడు రామయ్య కోసం ప్రత్యేకంగా సువాసనలు వెదజల్లేలా 108 అడుగుల పొడవు గల అగరబత్తిని తయారు చేసి స్వామి వారికి కానుకగా ఇవ్వబోతున్నాడు.. ఈ అగరబత్తి పొడవు అందరిని ఆకట్టుకుంటుంది.. అతను చాలా కష్టపడినట్లు తెలుస్తుంది..

ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం పూర్తవుతుందవుతుండగా అతను తయారు చేసిన అగరుబత్తిని రామమందిరానికి విరాళంగా ఇవ్వబోతున్నాడు. అగరుబత్తిని తయారు చేసేటప్పుడు బ్రహ్మచర్యాన్ని అనుసరించాడు.. ఆ ఇతరులను తాకడానికి అనుమతించలేదు. అగరుబత్తీతయారు చేయడానికి రామభక్తులు తనకు సహకరించారని చెప్పాడు. ప్రస్తుతం వర్షం కారణంగా పనులు నిలిపివేసినప్పటి కీ వర్షం కురిసిన తర్వాత మళ్లీ అగరబత్తి తయారీ పనులు చేపట్టనున్నారు. అగరుబత్తీల తయారీలో 3వేల 4 వందల కిలోల మెటీరియల్‌ను ఉపయోగించారు.

ఇక వడోదర నుంచి అగరుబత్తీ లు తీసుకువెళ్లడం చాలా పెద్ద విషయం కాబట్టి 4 లక్షలు ఖర్చవుతుందని తెలిపాడు. అగరుబత్తి రక్షణ కోసం రామాలయానికి సమర్పించేటప్పుడు భద్రత కోసం ఆయన ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి, గుజరాత్‌ సీఎంల సహాయం కోరారు.. ఈ బత్తీ తయారీలో పంచ ద్రవ్యాలు వినియోగించామని తెలిపారు. అయోధ్య లో భక్తుల సమక్షంలో అగర్ బత్తీని వెలిగిస్తామని ఆయన అంటున్నారు.. ఇకపోతే ఈ బత్తి తయారికి వాడిన పదార్థాలు అందరిని ఆకట్టుకున్నాయి.. ఈ అగరబత్తి కోసం ఏం పదార్థాలు వాడారో ఒకసారి చూద్దాం..

191 కిలోల ఆవునెయ్యి
376 కిలోల గుగ్గిలం పొడి
280 కిలోల బార్లీ
280 కిలోల నువ్వులు
280 కిలోల కందిపప్పు,
376 కిలోల కొబ్బరిపొడి
425 కిలోల పూర్ణాహుతి సామగ్రి
1,475 కిలోల ఆవుపేడ ను వినియోగించారని చెప్పారు..

Exit mobile version