Ayodhya: అయోధ్యలో 26 లక్షల దీపాలు.. రెండు గిన్నీస్ రికార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya: రామనగరిలో వెలుగుల వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి. అయోధ్య దీపోత్సవానికి ఏకంగా రెండు గిన్నీస్ రికార్డులు సొంతం అయ్యాయి. అయోధ్య నగరంలో 9వ దీపోత్సవంలో భాగంగా ఈ ఏడాది 26 లక్షలకుపైగా దీపాలను వెలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సరయూ నదీ తీరం వెంబడి లక్షలాది దీపాలను వెలిగించారు.
READ ALSO: Samantha : చిన్నారులతో సమంత దీపావళి వేడుకలు
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
నదీ తీరంలోని ఘాట్లు పెద్దఎత్తున భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రామ్‌లీలా వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షో ఆకట్టుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య రామమందిరంలో పూజలు నిర్వహించి, రామ్ కీ పైడీ ఘాట్‌లో హారతి ఇచ్చారు. అనంతరం ఆయన రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలోని కళాకారులు ఆశీనులైన రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఆయన దీపాన్ని వెలిగించి.. వేడుకలను ప్రారంభించారు. దీపోత్సవం నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజాగా అయోధ్య నగరంలో నిర్వహించిన దీపోత్సవం కార్యక్రమాన్ని 2017లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఇప్పుడు జరిగింది దీపోత్సవ్ తొమ్మిదవ ఎడిషన్. మొదటి ఎడిషన్‌లో 1.71 లక్షల దీపాలు వెలిగించగా, ఈసారి ఆ సంఖ్య 2.6 మిలియన్లు దాటింది. రామ్ కీ పైడితో సహా సరయు నది వెంబడి ఉన్న 56 ఘాట్లన్నీ దివ్యల వెలుగులు సంతరించుకున్నాయి. ఇన్ని దీపాలు ఒక దగ్గర కనిపించడంతో నక్షత్రాలు ఆకాశం నుంచి భూమికి దిగివచ్చినట్లుగా చూపరులను ఆకట్టుకుంది.
అయోధ్య దీపోత్సవంలో రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. మొదటిది 26,70,215 దీపాలను వెలిగించడం, రెండవది 2128 మంది పూజారులు సరయు తల్లికి ఏకకాలంలో మహా ఆరతి నిర్వహించడం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందుకున్నారు.
READ ALSO: Team India Loss Reasons: టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే!
తాజావార్తలు
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి