Uttarpradesh : కలల్లోకి వచ్చి నన్ను భయపెడుతుంది.. ప్రియురాలిని చంపి కాల్చేసిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో సంచలన హత్య కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. యువతి ఆగస్టు 24 నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. అయితే ఆమె అదృశ్యంపై పోలీసులకు సమాచారం అందలేదు. గురువారం గోసాయిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలోని పాత శిథిలమైన పోస్ట్ బంగ్లాలో కుళ్లిపోయిన యువతి మృతదేహం లభ్యమైంది. యువతి వయస్సు 21 సంవత్సరాలు, అంబేద్కర్ నగర్ నివాసి అని చెప్పారు.
Read Also:Gold Rate Today: మగువలకు శుభవార్త.. ఈరోజు గోల్డ్ రేట్ ఎంతుందంటే?
Also Read
మృతురాలి తల్లి మృతదేహాన్ని గుర్తించారు. ఆగస్ట్ 24 నుంచి కనిపించకుండా పోయిందని ఎంత వెతికినా కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఇద్దరు అబ్బాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారంలో యువతి హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడే ఈ విషయాన్ని అంగీకరించాడు. మృతురాలి తల్లి పోలీసులకు సమాచారం అందించారు.. రైల్వే స్టేషన్‌కు సమీపంలో తన కుమార్తె మృతదేహం పడి ఉందని ఓ యువకుడు తనకు ఫోన్ చేసి చెప్పాడని ఆమె తెలిపారు. తన కూతురు ఆ యువకుడి కలలోకి వచ్చి భయపెడుతోందని నిందితుడు చెప్పాడని తల్లి పేర్కొంది. అందుకే ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. ఈ కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు యువతి ప్రియుడు. పోలీసుల విచారణలో హత్య చేసినట్లు అంగీకరించడంతో పాటు కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపెట్టాడు.
Read Also:Success Story: రూ. 3వేలతో వ్యాపారం.. ప్రస్తుతం నెలకు రూ.70 లక్షల సంపాదన!
నిందితుడు విచారణలో తాను, తన ప్రియురాలు కలిసి ముంబై వెళ్లినట్లు తెలిపాడు. తర్వాత నిందితుడికి నచ్చని మరో అబ్బాయితో ఆ యువతి మాట్లాడడం మొదలు పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తన ప్రియురాలిని హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. హత్య చేసేందుకు ముందు రాయితో తలను చితకబాది, మృతదేహం త్వరగా కుళ్లిపోయేలా, హత్యకు సంబంధించిన ఆధారాలు చెరిగిపోయేలా రసాయనాలు వేసి కాల్చేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!