Site icon NTV Telugu

Ayesha Khan : ఆ స్టార్ హీరో మూవీలో ఆఫర్ కొట్టేసిన అయేషా ఖాన్..

Whatsapp Image 2024 02 27 At 11.40.42 Am

Whatsapp Image 2024 02 27 At 11.40.42 Am

ఆయేషా ఖాన్.. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదని చెప్పవచ్చు. ఈ బాలీవుడ్ భామకు టాలీవుడ్ లక్కీగా మారింది. వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. లేటెస్టుగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది…మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా చిత్రసీమలో హీరోగా వచ్చిన దుల్కర్ సల్మాన్… భాషలకు అతీతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ‘మహానటి’తో ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తమిళ అనువాద సినిమా ‘కనులు కనులు దోచాయంటే’తో మరో విజయం అందుకున్నారు. ఇప్పుడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా చేస్తున్నారు.’లక్కీ భాస్కర్’ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది..

అయితే ఆమె కాకుండా మరో హీరోయిన్ కు అవకాశం ఉందని తెలుస్తుంది.. ఆ పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ కూడా కథలో కీలకమైన ఆ పాత్రకు ఆయేషా ఖాన్ ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో భాగం కావడం తనకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉందని.. ‘లక్కీ భాస్కర్’లో నటిస్తున్న విషయాన్ని సోమవారం ఆయేషా ఖాన్ తెలిపారు.ముఖచిత్రం’తో ఆయేషా ఖాన్ తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది.. ఆ తర్వాత ‘ఓం భీమ్ బుష్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది.అలాగే ఈ భామా విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘సార్’ మూవీ విజయం తర్వాత వెంకీ అట్లూరి, నిర్మాతల కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version