Site icon NTV Telugu

Ayalaan : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అయాలాన్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2024 02 06 At 9.58.30 Pm

Whatsapp Image 2024 02 06 At 9.58.30 Pm

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్సన్ మూవీ ‘అయలాన్’. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రవికూమార్ తెరకెక్కించారు.అయలాన్ మూవీ తమిళనాడులో సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది.అయితే ఈ సినిమాను తెలుగు లో కూడా సంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సంక్రాంతికి భారీ సినిమాల తాకిడి ఉండటం తో అయలాన్ మూవీని వాయిదా వేశారు. దీనితో పాటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా వాయిదా పడింది.దీంతో రెండు వారాలు ఆలస్యంగా తెలుగు లో విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. దీంతో జనవరి 26 న విడుదల తేదీని ఫిక్స్ చేసి హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను కూడా మేకర్స్ నిర్వహించారు..

అయితే అయలాన్ తో పాటు వాయిదా పడిన కెప్టెన్ మిల్లర్ మూవీ రిలీజైన కూడా అయలాన్ మాత్రం విడుదలకు నోచుకోలేదు. అదే సమయంలో వరుసగా తెలుగు స్ట్రయిట్ సినిమాల రిలీజ్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ మరింత వెనక్కి వెళ్లింది. దీంతో మేకర్స్ అయలాన్ తెలుగు రిలీజ్ ని నిలిపివేశారు.ఇక ఎప్పటికైన థియేటర్లోకే ఈ మూవీ వస్తుందనుకుంటే తాజాగా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి ఈ మూవీ సన్ నెక్ట్స్ లో అందుబాటులోకి రానుంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఓటీటీ కి వేదికగా ఈ సినిమా చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version