Ayalaan Movie : రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి పండుగకు విడుదల అయ్యే సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసి మంచి వసూళ్లు సాధిస్తాయి. ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, అలాగే విజయ్ దళపతి వారసుడు సినిమాలు విడుదల అయి మంచి కలెక్షన్స్ రాబట్టాయి.ఇక వచ్చే సంక్రాంతికి కూడా రసవత్తర పోటి నెలకొననుంది..సంక్రాంతి పండుగ ఇంకా మూడు నెలలకి ఉండటంతో ఇప్పటి నుంచే కొన్ని మూవీస్ అప్పటికి స్లాట్‌లు బుక్ చేసుకుంటున్నాయి.తెలుగు సినిమాలకు పోటీగా ఈ సంక్రాంతికి ఓ తమిళ్ సినిమా రాబోతుంది.. ఈ మధ్యనే మహావీరుడుతో తెలుగులో మంచి హిట్టు కొట్టిన శివ కార్తికేయన్ ఇప్పుడు అయాలన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. సై-ఫై కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది.
ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా సీ.జీ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా వదిలారు. ఏలియన్ షిప్ నుంచి ఏలియన్ కిందకి పడుతున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌తోనే అంచనాలు భారీగా పెరిగాయి.. ఇక్కడ ఈ సినిమాపై అంత బజ్ లేదు కానీ.. తమిళనాట మాత్రం మాములు హైప్ లేదు. తొలిసారి హాలీవుడ్ రేంజ్ సినిమా వస్తుందని అక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఏర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 24AM స్టూడీయోస్ బ్యానర్‌పై ఆర్.డీ.రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో శివ కార్తికేయన్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి
Also Read
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్‌పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్‌పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!