NTV Telugu Site icon

Avocado Health Benefits : అవకాడోతో మీ శక్తి రెట్టింపు.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే..!

Avocado

Avocado

అవకాడోలు ఈ మధ్యకాలంలో త్వరితగతిన అందరికీ సుపరిచితమైన పండుగ ఉంది. ఇది ఇంచుమించు ప్రతి రెస్టారెంట్‌ మెనూలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ అవకాడో ఒక వైవిధ్యభరితమైన పండుగ అనే కాకుండా సలాడ్స్‌, స్మూతీస్‌, డోనట్స్‌ మరియు సాండ్‌విచ్‌ వంటి అనేక రకాల ఆహారపదార్థాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఈ అవకాడోను బట్టర్‌ ఫ్రూట్‌ అని కూడా అంటారు. ఆరోగ్యకరమైన కొవ్వు నిక్షేపాలు అధికంగా ఉండే ప్రత్యేక రకానికి చెందిన పండుగా గా ప్రసిద్ధి చెందింది. పండులో పొటాషియం, ఫోలెడ్‌ వంటి వాటితో సహా దాదాపు ఇరవై రకాల విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటుంది. అవకాడో బీ విటమిన్‌కు మంచి మూలంగా చెప్పబడుతోంది. క్రమంగా ఇది శరీరంలోని వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. వంద గ్రాముల అవకాడోలో 72.33 గ్రాముల నీరు మరియు 167 కిలో కాలరీల ఎనర్జీ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇంకా ఎన్నో ఖనిజాలు మరియు పోషకాలతో కూడుకొని సమృద్ధిగా ఉంటుంది.

Also Read : Minister Talasani: క్రిస్మస్ భవనానికి రూ.2కోట్లు మంజూరు.. 17 నుంచి క్రిస్మస్ గిఫ్ట్
అవకాడోలో అత్యధికంగా ఫైబర్‌ లోడ్‌ చేయబడి ఉంటాయి. క్రమంగా ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఉబకాయంతో సంబంధం ఉన్న అనేక వ్యాధులను ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి, మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఎంతగానో దోహద పడుతుంది. ఇది రక్తంలో చక్కర స్థాయిని క్రమబద్ధం చేయడానికి మరియు ఇన్సులిన్‌ స్థాయిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడోలో ల్యూటెన్‌ అధికంగా ఉంటాయి. ఇవి కంటి శుక్లాలు మరియు కళ్ళలో మధ్యలో వచ్చే రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించ గలవు. అవకాడోలు కాన్సర్‌ చికిత్సలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మానవుల లింఫోసైట్లు, కిమోథెరపీ మూలంగా తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించడానికి ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది.

అవకాడోలో మంచి మొత్తాల్లో ఫోలైట్‌ ఉంటుంది. ఇది గర్భస్రావం మరియు నాడీవ్యవస్థ లోపాల ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన ఖనిజం గా ఉంటుంది. దీనికి అదనంగా మీరు శిశువుల పాల నుంచి గణ ఆహారానికి తరలించిన అవకాడో వంటి రుచికరమైన ఆహారాలు మీ బిడ్డకు అందజేయడానికి ప్రయత్నించండి. ఇవి మృదువుగా ఉన్న కారణంగా మీ బిడ్డ ఆహారాన్ని నవల డానికి సులభతరమవుతుంది. మీరు వివిధ రకాల వంటల్లో వాటిని గుజ్జుగా చేసి అందులోని పోషక ప్రయోజనాలు పొందవచ్చు. ఆందోళన వంటి మానసిక రుగ్మతలను తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి అని చెప్పబడుతుంది.