NTV Telugu Site icon

Avikagor : సాగర కన్యలా మెరిసిపోతున్న అవికా.. ఎంత అందంగా ఉందో..

Avikagor

Avikagor

టాలీవుడ్ ముద్దుగుమ్మ అవికాగోర్ సినిమాల స్పీడ్ పెంచేసింది.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుని వెండితెరపైకి కథానాయికగా అడుగుపెట్టింది.. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి టాక్ ను అందుకుంది.. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న అమ్మడు ఇప్పుడు రెండు, మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించి ఆకట్టుకుంటుంది.. అయితే తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్‏గా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఈ అమ్మడి ఫాలోయింగ్ తగ్గలేదు.. ఒక్క తెలుగులోనే కాదు.. కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేస్తుంది. ఈ మధ్య ప్రొడ్యూసర్ గా కూడా అడుగువేసింది.. పలు సినిమాలు చేస్తుంది..

అలాగే హీరోయిన్ గా సినిమాలకు సైన్ చేస్తుంది.. ఒకవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఆకట్టుకుంది.. వైట్ డ్రెస్సులో సాగర కన్యలగా మెరిసింది.. దేవకన్యలా మెరిసిపోతుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి..