టాలీవుడ్ ముద్దుగుమ్మ అవికాగోర్ సినిమాల స్పీడ్ పెంచేసింది.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుని వెండితెరపైకి కథానాయికగా అడుగుపెట్టింది.. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి టాక్ ను అందుకుంది.. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న అమ్మడు ఇప్పుడు రెండు, మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించి ఆకట్టుకుంటుంది.. అయితే తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఈ అమ్మడి ఫాలోయింగ్ తగ్గలేదు.. ఒక్క తెలుగులోనే కాదు.. కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేస్తుంది. ఈ మధ్య ప్రొడ్యూసర్ గా కూడా అడుగువేసింది.. పలు సినిమాలు చేస్తుంది..
అలాగే హీరోయిన్ గా సినిమాలకు సైన్ చేస్తుంది.. ఒకవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఆకట్టుకుంది.. వైట్ డ్రెస్సులో సాగర కన్యలగా మెరిసింది.. దేవకన్యలా మెరిసిపోతుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి..