Site icon NTV Telugu

Avika Gor : అవికా గోర్ ని అసభ్యంగా తాకిన బాడీగార్డ్, ఏం చేసిందంటే ?

Avika Gor

Avika Gor

‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్ తో తెలుగువారికీ చేరువైంది అవికా గోర్ . ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు పరిచయమైనా అవికా గోర్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఆ తరువాత తాను నటించిన సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజు గారి గది 3 వంటి సినిమాల్లో నటించినా కూడా తనకు అంత పెద్ద పేరును తీసుక రాలేకపోయాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అవికా తన లేటెస్ట్ ఫోటోషూట్ లు, తన గురుంచి ఇంట్రెస్ట్ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన బాడీగార్డ్ తనను అసభ్యంగా తాకినట్లు వెల్లడించింది. అవికా గోర్ ఒక ఈవెంట్‌లో జరిగిన ఒక సంఘటనను వివరించింది, తాను వేదికపైకి వెళుతున్నప్పుడు, తనను ఎవరో వెనుక నుండి తాకినట్లు అనిపించింది. ఆమె వెనక్కి తిరిగినప్పుడు, ఆమె తన బాడీగార్డ్ ని చూసి ఆమె షాక్‌కు గురైనట్లు తెలిపింది. అలాంటి ఘటన మరో ఈవెంట్ లో రెండోసారి జరిగిందని, అయితే ఈసారి అది జరగబోతుండగానే తన బాడీగార్డ్ చేయి పట్టుకున్నానని అవికా పేర్కొంది. వెంటనే అతను క్షమాపణ చెప్పాడు కాబట్టి నేను దానిని వదిలిపెట్టాను అని తెలిపింది.

Influencer Avika Gor shares that her bodyguard touched him inappropriately
byu/funkeytoken inInstaCelebsGossip

Exit mobile version